కార్తీక దీపంకు శుభం కార్డు పడే టైం దగ్గరకు వచ్చిందట

తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల హృదయాలకు చేరువైన కార్తీక దీపం సీరియల్‌ క్లైమాక్స్ కు వచ్చిందని చాలా నెలలుగా అనుకుంటున్నారు.సీరియల్‌ కు వస్తున్న రేటింగ్‌ నేపథ్యంలో కథను సాగతీస్తూ వస్తున్నారు.

 Star Maa Kaarthika Deepam Serial May End Very Soon, Deepa, Doctor Babu, Kaarthik-TeluguStop.com

డాక్టర్ బాబు మరియు దీపలను కలిపేస్తే కథ ఏమీ ఉండదు అనే ఉద్దేశ్యంతో వారిని కలపకుండా దీపను కంటిన్యూస్ గా ఏడిపిస్తూనే ఉన్నారు.దాంతో కార్తీక దీపం సీరియల్‌ కు గత కొన్ని వారాలుగా రేటింగ్‌ తగ్గింది.

ఒకానొక సమయంలో కార్తీక దీపం సీరియల్‌ రేటింగ్‌ ఉత్తరాది కార్యక్రమాలను కూడా క్రాస్‌ చేసేది.అంతటి రేటింగ్ ను దక్కించుకున్న కార్తీక దీపం ఇప్పుడు జబర్దస్త్‌ రేటింగ్ తో పోటీ పడే పరిస్థితి వచ్చింది.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న రీతిలో ఈ సమయంలోనే సీరియల్ ను ముగిస్తే గౌరవ ప్రథమంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ మెల్లగా సీరియల్‌ కు శుభం కార్డ్‌ వేయాలని భావిస్తున్నారట.

స్టార్‌ మా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 30 నుండి 40 ఎపిసోడ్ లో సీరిల్ అయిపోబోతుందట.

ఈ విషయమై ఇప్పటికే సీరియల్‌ నిర్మాణ సంస్థ స్టార్‌ మా వారికి చెప్పడంతో ఆ స్లాట్‌ లో మరో సీరియల్‌ ను వేసేందుకు ఇప్పటి నుండే చర్చలు జరుపుతున్నారు.కార్తీక దీపం యూనిట్‌ సభ్యులతోనే మరో సీరియల్‌ ను కూడా స్టార్ మా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి డాక్టర్ బాబు మరియు దీపలను కలవాలంటూ ఎంతో మంది పూజలు వ్రతాలు చేశారు.వారి పూజలు ఫలించి కొన్ని రోజుల్లోనే కార్తక దీపం డాక్టర్‌ బాబు దీపలు కలువబోతున్నారు.

ఇది అందరికి ఆనందం ను ఇస్తుంది.కార్తీక దీపం సీరియల్‌ లో హీరో హీరోయిన్‌ కలవాలని విలేజ్‌ ప్రేక్షకులు ఎంతగా కోరుకుంటున్నారో వారి పూజలు వ్రతాలు చూస్తేనే అర్థం అవుతుంది.

అలాంటి సీరియల్ ను ముగించాలంటే మా టీవీకి కాస్త ఇబ్బందే అయినా కూడా తప్పదు అని శుభం కార్డు వేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube