ఆ షోలో కన్నీళ్లు పెట్టుకున్న మోనాల్.. కారణమేంటంటే..?  

star maa dancee plus latest promo monal gajjar emotional crying, star maa dancee plus , monal gajjar , Omkar, emotional crying - Telugu Concept Round, Dancee Plus Show, Emotional Crying, Monal Gajjar, Omkar

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని బిగ్ బాస్ షో తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు మోనాల్ గజ్జర్.హీరోయిన్ గా కెరీర్ లో సుడిగాడు లాంటి బ్లాక్ బస్టర్ ఉన్నా సుడిగాడు తర్వాత పెద్దగా అవకాశాలు రాని మోనాల్ కు బిగ్ బాస్ షో మాత్రం బాగానే కలిసొచ్చింది.

TeluguStop.com - Star Maa Dancee Plus Latest Promo Monal Gajjar Emotional Crying

మోనాల్ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ ఆఫర్లతో పాటు డ్యాన్సీ ప్లస్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ షో ప్రోమో విడుదల కాగా షోలో మోనాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో చిన్నచిన్న విషయాలకు కూడా ఏడ్చి నర్మదగా పేరు తెచ్చుకున్న మోనాల్ గజ్జర్ నర్మదగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ వారం ప్రసారం కాబోయే డ్యాన్సీ ప్లస్ షోలో ఈ వారం ఓంకార్ కాన్సెప్ట్ రౌండ్ ఉంటుందని చెప్పారు.

TeluguStop.com - ఆ షోలో కన్నీళ్లు పెట్టుకున్న మోనాల్.. కారణమేంటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కాన్సెప్ట్ రౌండ్ లో భార్య భర్తను “ఎందుకండీ.ఏమైందీ అంత టెన్షన్ గా ఉన్నారు” అని అడగగా ” ఈ దరిద్రం పుట్టినప్పటి నుంచి అన్నీ లాస్ అవుతున్నాయి” అని కూతురు గురించి చెబుతాడు.

తండ్రి కూతురును మళ్లీ ఇంటికి రాకు అంటూ ఇంటి నుంచి బయటకు పంపిస్తాడు.ఆ తరువాత చిన్న పాప నిండు కుండ వేళ పాటకు డ్యాన్స్ చేసి ” మీ సుఖానికి, సంతోషానికి తాను ప్రతిరూపాన్ని అని.మీ ప్రేమకు తాను కానుకనని.తనను తల్లిదండ్రులు బొమ్మను చూసి భూమిపై పడేశారని.

మీ కష్టాలకు కారణం నేనా” అంటూ ప్రశ్నించారు.ఆ పాట చూసిన రఘు మాస్టర్ కూతురంటే అదృష్టం అని పేర్కొన్నారు.

చిన్న పాప మోనాల్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి ఏడుస్తూనే ఉన్నారు.అయితే మోనాల్ ఏడుపు గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మోనాల్ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవాలని కొందరు నెటిజన్లు చెబుతుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం మోనాల్ ఏడుపుపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

#Concept Round #Omkar #Monal Gajjar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు