అనసూయకు స్టార్ మా బంపర్ ఆఫర్.. ఒక్కో ఎపిసోడ్ కు భారీగా ముట్ట చెబుతున్న స్టార్ మా?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఈ కార్యక్రమం ద్వారా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

 Star Maa Bumper Offer To Anchor Anasuya, Star Maa, Anchor Anasuya, Jabardasth, Anasuya Remuneration-TeluguStop.com

ఇలా ఈమెకు వెండితెరపై కూడా మంచి గుర్తింపు రావడంతో వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్నారు.ఇకపోతే అనసూయ ప్రస్తుతం వెండితెరపై బిజీగా ఉండటం వల్ల తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.

ఈ విధంగా ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి వీడ్కోలు పలకడమే కాకుండా తాను స్టార్ మా లో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే అనసూయకు స్టార్ మా భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వడంతోనే తను స్టార్ మాకు వెళ్ళిందనే వార్తలు కూడా వినపడుతున్నాయి.

 Star Maa Bumper Offer To Anchor Anasuya, Star Maa, Anchor Anasuya, Jabardasth, Anasuya Remuneration-అనసూయకు స్టార్ మా బంపర్ ఆఫర్.. ఒక్కో ఎపిసోడ్ కు భారీగా ముట్ట చెబుతున్న స్టార్ మా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జబర్దస్త్ కార్యక్రమంలో అనసూయ ఒక్కో ఎపిసోడ్ కు మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేదని వార్తలు వచ్చాయి.అయితే స్టార్ మాలో తనకు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్ల తను స్టార్ మాకు వెళ్లిందని తెలుస్తోంది.

స్టార్ మాలో అనసూయ ఒక్కో ఎపిసోడ్ కు సుమారు ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.అంతేకాకుండా డేట్స్ విషయంలో కూడా స్టార్ మా పూర్తిగా ఆ నిర్ణయం అనసూయకే ఇవ్వడంతో ఈమె స్టార్ మా కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.అనసూయకు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకున్న స్టార్ మా రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం వెనకాడకుండా తనకు ఒక్కో ఎపిసోడ్ కు భారీగానే ముట్ట చెప్పడం వల్ల అనసూయ జబర్దస్త్ వదిలి స్టార్ మా కి షిఫ్ట్ అయిందనీ ప్రస్తతం ఈమే స్టార్ మా కార్యక్రమాలతో పాటు సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube