సైకిల్ దొంగతనం చేసి అరెస్ట్ అయిన స్టార్ ఐపీఎల్ క్రికెటర్  

Star Ipl Cricketer Become Thief In Australia - Telugu Indian Cricket, Star Ipl Cricketer, Thief In Australia, World Cricket

చేతులోకి వచ్చిన అదృష్టాన్ని కొంత మంది చేజేతులా నాశనం చేసుకుంటారు.తమ దురలవాట్లు వలన స్టార్స్ అయ్యి కోట్లు సంపాదించాల్సిన వాళ్ళు ఫుట్ పాత్ కి పడిపోతారు.

Star Ipl Cricketer Become Thief In Australia

ఇలాంటి జీవితాలు మన చుట్టూ ఉన్నవారిలో చాలా మందికి ఉంటుంది.ఇప్పుడు అలాంటి జీవితాన్ని ఒకప్పటి స్టార్ క్రికెటర్ కలిగి ఉన్నాడు.

స్టార్ క్రికెటర్ గా దేశానికి ఆడాల్సిన వాడు చెడు అలవాట్లు వలన చివరికి సైకిల్ దొంగతనం చేసి దొరికిపోయాడు.డ్రగ్స్ కి బానిసై చిల్లర దొంగగా సొంత ఇల్లు కూడా లేక రోడ్డున బ్రతుకుతున్నాడు.

తారా జువ్వలా ఆస్ట్రేలియా క్రికెట్ లోకి దూసుకొచ్చిన ల్యూక్ పోమర్స్ బ్యాక్ 2007లో ఆస్ట్రేలియా తరపున ఏకైక టీ20 ఆడాడు.అప్పటికే ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్స్ లో సత్తా అతనిని ప్రతిభని గుర్తించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక ధరలు 3 లక్షల డాలర్ల చెల్లించి కింగ్స్ లెవన్ పంజాబ్ అతనిని కొనుగోలు చేసింది.2011 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ల్యూక్ ను దక్కించుకుంది.ఇక 2013లో మరోసారి పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ల్యూక్.

ఆ తరువాత ఐపీఎల్లో ఆడే అవకాశం రాలేదు.ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన జరిగిన మ్యాచ్ లో అమెరికన్ యువతిని వేధించాడని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్కడి నుంచి అతని పతనం మొదలవుతూ వచ్చింది.స్టార్ క్రికెటర్ అయ్యి దేశానికి ఆడాల్సిన వాడు డ్రగ్స్ కి బానిసయ్యాడు.

అతనికి క్రికెట్ ప్రస్తానం ముగిసిన తరువాత ఒక సారి బైకు దొంగతనం చేసి కటకటాల పాలయ్యాడు.ఆ తరువాత ఫుల్లుగా మద్యం సేవించి డ్రంక్ డ్రైవ్ చేసి పోలీసులకు దొరికిపోయాడు.

మరోసారి లిక్కర్ షాప్ నుంచి మద్యం దొంగిలించి పోలీసులకి చిక్కిపోయాడు.తాజాగా సైకిల్ దొంగతనం చేసి పోలీసులకి చిక్కడు.

తాజా వార్తలు

Star Ipl Cricketer Become Thief In Australia-star Ipl Cricketer,thief In Australia,world Cricket Related....