టాప్ హీరోలు సైతం సినిమాలు చేయాలనుకునే దర్శకులు ఎవరో తెలుసా?

ఒకప్పుడు సినిమాలు అనేవి హీరోల కేంద్రంగా తెరకెక్కేవి.హీరోలను చూసే జనాలు సినిమాలకు వెళ్లేవారు.

 Star Heros Who Wants To Work With These Directors, Shanker, Rajamouli, Prashanth-TeluguStop.com

ప్రస్తుతం ఆ ట్రెండ్ మారిపోయింది.దర్శకుల సత్తాతోనే సినిమాలు తెరకెక్కుతున్నాయి.

ఒకప్పుడు హీరోలను చూసి సినిమాలకు వెళ్లిన జనాలు ఇప్పుడు దర్శకులు ఎవరో తెలుసుకుని సినిమాలు చూస్తున్నారు.ఒకప్పుడు పలువురు టాప్ హీరోలతో సినిమాలు చేయాలని దర్శకులు భావించేవారు.

ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం కొందరు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆరాట పడుతున్నారు.వారు సినిమా చేద్దామంటే ఎగిరి గంతేసి ఒకే చెప్పేందుకు రెడీ అవుతున్నారు.ఇంతకీ స్టార్ హీరోలను సైతం తమ మ్యాజిక్ తో ఆకట్టుకుంటున్న దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

శంకర్‌

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో శంకర్ టాప్ డైరెక్టర్ గా చెప్పుకోవచ్చు.తన మార్క్ టేకింగ్ తో సినిమా స్థాయిని ఓ రేంజిక తీసుకెళ్లడంతో ఆయనకు ఆయనే సాటి.హీరోలు ఎవరు అనే విషయాన్ని పట్టించుకోకుండా శంకర్ కోసం సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు.

కెరీర్ మొదటి నుంచి తను తీసిని సినిమాలు.అద్భుత విజయాలు అందుకున్నాయి.

ప్రస్తుతం శంకర్ తో ఒక్కసినిమా అయినా చేయాలి అనుకునే హీరోలు ఎంతో మంది ఉన్నారంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం రాం చరణ్ తో శంకర్ ఓ మూవీ చేస్తున్నాడు.అటు అపరిచితుడు సినిమాను రణ్ వీర్ సింగ్ హీరోగా బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్నాడు.

రాజమౌళి

Telugu Directors, Omrauth, Prashanth Neel, Rajamouli, Shanker, Tollywood Heros-T

బాహుబలి సినిమాతో ఇండియన్ ఫిల్మ్ సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.ఈయన తెరకెక్కించిన బాహుబలి తర్వాతే నార్త్ లో గానీ, సౌత్ లో గానీ పాన్ ఇండియన్ మూవీస్ నిర్మాణం ఊపందుకుంది.ప్రస్తుతం దక్షిణాది హీరోలంతా తన సినిమాలను పాన్ ఇండియా సినిమాల స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు.

అంతేకాదు.ఏమాత్రం అవకాశం దొరికినా రాజమౌళితో సినిమా చేయాలని ఎంతో మంది హీరోలు భావిస్తున్నారు.

రాజమౌళి చేతిలో పడితే తమ కెరీర్ ఊహించని రేంజ్ లో రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు.ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు.

ప్రశాంత్‌ నీల్

Telugu Directors, Omrauth, Prashanth Neel, Rajamouli, Shanker, Tollywood Heros-T

కేజీఎఫ్ సినిమా తీసి దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు ప్రశాంత్ నీల్.సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా ఓ రేంజిలో విజయం సాధించింది.తన అద్భుతమైన టేకింగ్ జనాలకు విపరీతంగా నచ్చింది.ఈ సినిమా హీరో యశ్.ఒకే సినిమాతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ పొందాడు.ఈ సినిమాతో చాలా మంది హీరోలకు ప్రశాంత్ ఫేవరెట్ డైరెక్టర్ గా మారాడు.

పలువురు అగ్రహీరోలు సైతం తనతో సినిమాలు చేసేందుకు సంప్రదించారు కూడా.ప్రస్తుతం కేజీఎఫ్-2 పూర్తి కాగానే ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు.

ఓం రౌత్‌

Telugu Directors, Omrauth, Prashanth Neel, Rajamouli, Shanker, Tollywood Heros-T

ఓం రౌత్‌ తెరకెక్కించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ తానాజీ.తానాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాడు.ఆయన వీరత్వాని వెండితెర మీద ఆరబోశాడు.ఈ సినిమా ఓ రేంజిలో హిట్ అయ్యింది.గతేడాది థియేటర్లలో విడుదలైన సినిమాల్లో తానాజీ రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ఆయన చారిత్రక సినిమాల నుంచి పౌరాణిక సినిమాల వైపు రూటు మార్చాడు.

ప్రస్తుతం ప్రభాస్ తో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు.అటు బాలీవుడ్ టాప్ హీరోలు తనతో సినిమాలు చేసేందుకు ఆరాట పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube