శివ వెంట పడుతున్న స్టార్‌ హీరోలు... ఇప్పుడేం చేస్తాడు?  

Star Heros Back Of Director Shiva-

సక్సెస్‌ వచ్చిన దర్శకుడి వెంట హీరోలు మరియు నిర్మాతలు పడటం చాలా కామన్‌.ఇప్పుడు అదే పరిస్థితి శివ నిర్వాన విషయంలో జరుగుతుంది.‘నిన్ను కోరి’ చిత్రం సక్సెస్‌ అయినా కూడా శివ నిర్వాన గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.అయితే అదే దర్శకుడు ‘మజిలీ’ చిత్రాన్ని చేసి సూపర్‌ హిట్‌ సాధించడంతో ఆ దర్శకుడిపై యువ హీరోల కన్ను పడింది.చిన్న హీరోల నుండి స్టార్‌ హీరోల వరకు ఆయన దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఆసక్తి చూపడంతో పాటు, ఆయనతో అప్పుడే చర్చలు జరుపుతున్నారు.

Star Heros Back Of Director Shiva--Star Heros Back Of Director Shiva-

ఇప్పటికే శివ నిర్వాన దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఒక చిత్రంను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ విషయమై క్లారిటీ రాకముందే మరో వార్త ఒకటి సినీ వర్గాల్లో హల్‌ చల్‌ చేస్తోంది.

Star Heros Back Of Director Shiva--Star Heros Back Of Director Shiva-

మెగా కాంపౌండ్‌కు చెందిన ఒక వ్యక్తి రామ్‌ చరణ్‌ కోసం కథ తయారు చేయాల్సిందిగా శివ నిర్వానను కలిసి చెప్పాడని, ఒక మంచి ఎమోషనల్‌ లవ్‌ డ్రామా మూవీ మీ దర్శకత్వంలో చేసేందుకు రామ్‌ చరణ్‌ ఆసక్తి చూపుతున్నాడు అంటూ ఆ వ్యక్తి శివ నిర్వానతో చేప్పినట్లుగా సమాచారం అందుతోంది.

విజయ్‌ దేవరకొండ, రామ్‌ చరణ్‌లు మాత్రమే కాకుండా ఇంకా పలువురు యంగ్‌ హీరోలు కూడా శివ నిర్వానపై మోజు పుడుతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.శివ దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన ‘మజిలీ’ చిత్రం మొదటి అయిదు రోజుల్లోనే 20 కోట్ల షేర్‌ను రాబట్టింది.లాంగ్‌ రన్‌లో మజిలీ చిత్రం 40 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే శివ నిర్వాన కూడా తన పారితోషికం పెంచినట్లుగా సమాచారం అందుతోంది.