హీరోయిన్ త్రిష ముద్దు పేర్లు ఏంటో తెలుసా..?

తెలుగు, తమిళ భాషల్లో కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష పుట్టినరోజు నేడు అనే సంగతి తెలిసిందే.జోడీ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించి నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన త్రిష ఆ తరువాత నీ మనస్సు నాకు తెలుసు అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు.

 Star Heroine Trisha Nick Name Details-TeluguStop.com

ఆ సినిమాలో నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన త్రిష ఆ తరువాత వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అనే తేడాల్లేకుండా అందరు హీరోలతో నటించారు.

ప్రస్తుతం తెలుగులో ఈ హీరోయిన్ కు పెద్దగా ఆఫర్లు లేకపోయినా తమిళంలో మాత్రం త్రిష చేతినిండా సినిమాలు ఉన్నాయి.1983లో జన్మించిన త్రిష మొదట కొన్ని టీవీ యాడ్స్ లో నటించారు.1999 సంవత్సరం మిస్ చెన్నైగా ఎంపికైన త్రిష వర్షం సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మొదట త్రిష హీరోయిన్ గా ఎంపికై కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.

 Star Heroine Trisha Nick Name Details-హీరోయిన్ త్రిష ముద్దు పేర్లు ఏంటో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపు రెండు దశాబ్దాల నుంచి వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న త్రిష నాన్న చనిపోయిన సమయంలో ఎంతో బాధ పడ్డారు.

ప్రముఖ వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ తరువాత త్రిష పెళ్లికి నో చెప్పారు.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ ద్వారా కూడా ఈ నటి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తనకు అమ్మే స్పూర్తి అని త్రిష చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ట్రాష్, హనీ, ట్రిష్ త్రిష ముద్దుపేర్లు కాగా ఫోన్ కు అడిక్ట్ అయిపోతానని తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ను త్రిష వెల్లడించారు.

గేమ్స్ ఆడటానికి, మెసేజ్ లు పంపడానికి తాను ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తానని త్రిష చెప్పుకొచ్చారు.

#Trisha #Trash #Nick Name #Honey #Trish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు