ఆచార్యలో మరో స్టార్ బ్యూటీ.. చిందులే చిందులు!  

Star Heroine To Do Special Song In Acharya, Acharya, Chiranjeevi, Koratala Siva, Ram Charan, Tollywood News - Telugu Acharya, Chiranjeevi, Koratala Siva, Ram Charan, Tollywood News

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.

 Star Heroine To Do Special Song In Acharya

కాగా ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కొరటాల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.అయితే ఈ పాటలో చిరుతో కలిసి చిందులేసేందుకు ఓ స్టార్ బ్యూటీని తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట.

ఆచార్యలో మరో స్టార్ బ్యూటీ.. చిందులే చిందులు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గతంలో చిరు నటించిన ఖైదీ నెంబర్ 150లో హాట్ ఐటెం బాంబ్ రాయ్ లక్ష్మీ చిరుతో కలిసి స్టెప్పులేయగా, ఆ పాట సూపర్ హిట్‌గా నిలిచింది.దీంతో ఇప్పుడు మరోసారి చిరు సరసన ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ పడిందట.

ఇక ఈ పాట చాలా మాస్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్‌న వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఈ సినిమాలో చిరుతో అదిరిపోయే చిందులు వేసే ఆ స్టార్ బ్యూటీ ఎవరో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

#Ram Charan #Chiranjeevi #Acharya #Koratala Siva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Star Heroine To Do Special Song In Acharya Related Telugu News,Photos/Pics,Images..