రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న తమన్నా.. సామ్ కంటే ఎక్కువగా?

Star Heroine Tamannah Remuneration For Special Songs Details Here

పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా ఊహూ అంటావా మావా పాట ఊహించని స్థాయిలో హిట్ అయిన సంగతి తెలిసిందే.ఊ అంటావా ఫుల్ సాంగ్ కు 7 కోట్ల వ్యూస్ రాగా ఊ అంటావా వీడియో సాంగ్ కు మూడున్నర కోట్ల వ్యూస్ వచ్చాయి.

 Star Heroine Tamannah Remuneration For Special Songs Details Here-TeluguStop.com

సమంత కూడా పుష్ప ది రైజ్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.పుష్ప ది రైజ్ సక్సెస్ వల్ల టాలీవుడ్ డైరెక్టర్లు తమ సినిమాలలో హీరోయిన్లతో స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చేయించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

వరుణ్ తేజ్ హీరోగా గని సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.అయితే ఈ సాంగ్ కొరకు తమన్నా ఏకంగా 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆ మొత్తం ఇవ్వడానికి మేకర్స్ సైతం అంగీకరించారని తెలుస్తోంది.

క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు సైతం ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడం లేదు.

కానీ తమన్నా మాత్రం వయస్సు పెరుగుతున్నా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అనే విధంగా వ్యవహరిస్తున్నారు.

ఈ నెల 15వ తేదీన తమన్నా చేసిన ఈ స్పెషల్ సాంగ్ రిలీజ్ కానుంది.తమన్నా గతంలోనే కొన్ని సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసినా ఆ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు తీసుకున్న పారితోషికం ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

పారితోషికం గురించి వైరల్ అవుతున్న వార్తలపై తమన్నా స్పందిస్తారేమో చూడాలి.

Telugu Crore Rupees, Gani, Item, Tamanna-Movie

మరోవైపు తమన్నాకు హీరోయిన్ గా కూడా ఆఫర్లు తగ్గడం లేదు.హీరోయిన్ గా కెరీర్ కు గుడ్ బై చెప్పేలోపు తమన్నా సీనియర్ హీరోలందరితో కూడా నటిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య తమన్నా కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా భవిష్యత్తులో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందేమో చూడాలి.

#Crore Rupees #Tamanna #Gani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube