స్టార్ హీరోయిన్ తమన్నా ఫుట్ వేర్ ఖరీదు అన్ని లక్షలా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే.అవకాశాలు తగ్గిన సమయంలో బాహుబలి, బాహుబలి2 సక్సెస్ సాధించడంతో తమన్నాకు ఆఫర్లు పెరిగాయి.

 Star Heroine Tamannah High Heels Price Goes Viral In Social Media, High Heels ,-TeluguStop.com

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో తమన్నా బిజీగా ఉన్నారు.తమన్నా హోస్ట్ చేస్తున్న మాస్టర్ చెఫ్ తెలుగు షో కర్టెన్ రైజర్ నిన్న జెమినీ ఛానల్ లో ప్రసారం కాగా శుక్ర, శనివారాలలో రాత్రి 8.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.

వెండితెరపై సత్తా చాటిన తమన్నా బుల్లితెరపై కూడా సత్తా చూపే ప్రయత్నం చేస్తున్నారు.

తమన్నా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాల షూటింగ్ లు ఇప్పటికే పూర్తి కాగా త్వరలో ఈ నటించిన పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి.ఈ షో కోసం తమన్నా ట్రెండీ వేర్ ను ధరించగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

తమన్నా సోషల్ మీడియాలో ఫోటోలను చేయగా ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Telugu Heels, Masterchef, Tamannah, Tollywood-Movie

అయితే ఈ ఫోటోలలో తమన్నా వేసుకున్న హై హీల్స్ ధర తెలిసి షాకవ్వడం అభిమానుల వంతవుతోంది.తమన్నా ధరించిన ఈ హై హీల్స్ ధర ఏకంగా 1,38,000 రూపాయలు కావడం గమనార్హం.తమన్నా ఫుట్ వేర్ ధర తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.

మరోవైపు తమన్నా ఒకవైపు ఆఫర్లతో బిజీగా ఉంటూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆ సాంగ్స్ ద్వారా పాపులారిటీని పెంచుకుంటున్నారు.

Telugu Heels, Masterchef, Tamannah, Tollywood-Movie

తమన్నా నటించిన సీటీమార్ వచ్చే నెలలో రిలీజ్ కానుండగా మ్యాస్ట్రో కూడా వచ్చే నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి.ఎఫ్3 సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిసుండగా సంక్రాంతికి ఎక్కువ సంఖ్యలో సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో దిల్ రాజు రిలీజ్ డేట్ విషయంలో వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube