పైకి చెప్పుకోలేని సమస్యతో బాధ పడుతున్న మిల్కీ బ్యూటీ.. ఏం జరిగిందంటే?

ఎంత గొప్పవాళ్లు అయినా ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధిస్తూ ఉంటుంది.కొన్ని ఆరోగ్య సమస్యలు కొన్నిరోజుల పాటు వేధిస్తే మరికొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రం సంవత్సరాల పాటు వేధిస్తున్నాయి.

 Star Heroine Tamannah Health Issue Details, Health Issue, Interesting Facts, Jui-TeluguStop.com

స్టార్ హీరోయిన్ తమన్నా పైకి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నారు.ఒక సందర్భంలో తమన్నా మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ ఆరోగ్య సమస్యలను చెప్పుకోగా తాజాగా ఆ జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా చేరారు.

తన ఆహారపు అలవాట్లు మంచి ఆహారపు అలవాట్లు అని అయితే ఎక్కువగా వర్క్ చేయడం మరియు ఎక్కువగా ఒత్తిడిని ఫేస్ చేయడంతో తనకు ఆరోగ్య సమస్య ఎదురైందని మిల్కీ బ్యూటీ వెల్లడించారు.

ఆర్గానిక్ ఆహార పదార్థాలను తీసుకుంటూ ప్రస్తుతం తను బాధ పడుతున్న సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నానని తమన్నా అన్నారు.ఈ ఆరోగ్య సమస్యకు చెక్ పెట్టడానికి నోని పండుతో తయారు చేసిన జ్యూస్ తాగుతున్నానని తమన్నా వెల్లడించారు.

తినే వంటకాలలో పసుపు ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నానని తమన్నా పేర్కొన్నారు.

Telugu Tamanna, Tamanna Diet, Tamanna Problem-Movie

ఎక్కువగా వేయించిన వంటకాలకు దూరంగా ఉంటున్నానని తమన్నా పేర్కొన్నారు.ప్రతిరోజు కీర జ్యూస్ తో పాటు ఉసిరి జ్యూస్ కూడా తీసుకుంటున్నానని ఆమె అన్నారు.జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుందని తమన్నా పేర్కొన్నారు.

వీటితో పాటు కొబ్బరి నీళ్లను కూడా తాను తాగుతానని ఆమె వెల్లడించారు.

Telugu Tamanna, Tamanna Diet, Tamanna Problem-Movie

ఘనాహారం తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని తమన్నా పేర్కొన్నారు.13 సంవత్సరాలుగా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నానని తమన్నా వెల్లడించారు.తాను మంచి డైటీషియన్ ను నియమించుకుని ఉంటే బాగుండేదని అలా చేయకుండా తప్పు చేశానని తమన్నా పేర్కొన్నారు.

తమన్నా ఆరోగ్య సమస్య గురించి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube