స్టార్ హీరోయిన్ తమన్నా బ్యూటీ సీక్రెట్ ఇదే..?

సాధారణంగా స్టార్ హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు మేకప్ తో మాత్రమే ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటారు.మేకప్ లేకపోతే కొంతమంది హీరోయిన్లను గుర్తు పట్టడం కూడా అంత తేలికైన విషయం కాదు.

 Star Heroine Tamanna Beauty Secret Details  Here, 1 Hours, Beauty Secret Details-TeluguStop.com

అయితే మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం మేకప్ లేకుండా కూడా అందంగా కనిపిస్తారు.అందువల్లే ఈ బ్యూటీకి మిల్కీ బ్యూటీ అనే పేరు కూడా వచ్చింది.

సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసిన ఈ బ్యూటీ త్వరలో మాస్టర్ చెఫ్ అనే కుకింగ్ షోతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

తమిళంలో మాస్టర్ చెఫ్ షోకు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించనుండగా తెలుగులో ఈ షోకు తమన్నా హోస్ట్ గా ఉన్నారు.

తాజగా ఈ బ్యూటీ తాను బ్యూటిఫుల్ గా, హెల్తీగా ఉండటానికి గల కారణాలను చెప్పుకొచ్చారు.తన శరీరం రంగుకు, ఎప్పుడూ అలసిపోకుండా కనిపించడానికి తీసుకునే ఆహారమే కారణమని ఆమె పేర్కొన్నారు.

అందంగా కనిపించడం కొరకు తాను రాత్రి భోజనాన్ని మానేశానని తమన్నా అన్నారు.

ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల సమయంలో భోజనం చేస్తానని ఉదయం ఆరు గంటల సమయంలో టిఫిన్ చేస్తానని తమన్నా చెప్పుకొచ్చారు.దాదాపు 12 గంటలు ఏ ఆహారం తీసుకోకపోవడం వల్లే తన చర్మకాంతి మెరుగైందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల తనకు బాగా నిద్ర కూడా పట్టేదని ఆమె చెప్పుకొచ్చారు.ఆహారపు అలవాట్లు మారిన తర్వాత తాను గతంతో పోలిస్తే ఎక్కువ ఉత్సాహంతో పని చేస్తున్నానని ఆమె అన్నారు.

Telugu Hours, Secret, Tamanna-Movie

మాస్టర్ చెఫ్ షోతో బుల్లితెరకు పరిచయమవుతున్న తమన్నా బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.తమన్నా చేతిలో సినిమాలు బాగానే ఉన్నప్పటికీ ఆమె బుల్లితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.తమన్నా బుల్లితెరపై కూడా సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube