రూ.పది కోట్లకు ఆశ పడి చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొందరు నటనపై ఆసక్తి ఉండటంతో ఇండస్ట్రీలో అడుగు పెడతారు.మరికొందరు ఎక్కువగా సంపాదించవచ్చని అడుగు పెడతారు.

 Star Heroine Spoiled Her Career 10crores Agreement-TeluguStop.com

చాలా వరకు చాలామంది నటీనటులు పారితోషకం విషయంలోనే బాగా ఆసక్తి చూపుతారు.ఇక కొన్నిసార్లు పారితోషకం కోసం బాగా ఆశపడి కెరీర్ కూడా నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు.

ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరోయిన్ కూడా 10 కోట్లకు ఆశపడి తన కెరీర్ మొత్తం నాశనం చేసుకుంది.

 Star Heroine Spoiled Her Career 10crores Agreement-రూ.పది కోట్లకు ఆశ పడి చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజానికి ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.

వరుస సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.కానీ 10 కోట్లకు ఆశపడి సినిమాలలో అవకాశాలు లేకుండా చేసుకుంది.

ఇంతకీ ఆమె ఎవరో కాదు కేరళ ముద్దుగుమ్మ అసిన్. గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఆ తర్వాత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఘర్షణ, లక్ష్మీ నరసింహ, ఇక నాగార్జున నటించిన శివమణి సినిమాలో మూగ అమ్మాయిగా అందరి మనసులను దోచుకుంది.పలు డబ్బింగ్ సినిమాలలో నటించిన ఈమె చాలావరకు స్టార్ హీరోల సరసననే నటించింది.తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలో కూడా నటించింది.ఈమె భరతనాట్యంలో కూడా మంచి నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంది.ఈమె దాదాపు ఎనిమిది భాషలలో మాట్లాడగలదు.

ఇక తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.దీంతో ఆమెకు 2007లో క్వీన్ ఆఫ్ కోలీవుడ్ అని బిరుదు కూడా వచ్చింది.చాలా వరకు తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.

తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.తెలుగు, తమిళ సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

ఇక 2015లో సినీ ఇండస్ట్రీకి దూరం కాగా 2016లో ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మ ను పెళ్లి చేసుకుంది.అతను మైక్రోమ్యాక్స్ సంస్థకు కో ఓనర్ గా చేస్తున్నాడు.

వీరికి ఒక పాప కూడా ఉంది.

ఇక మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో అసిన్ ఇండస్ట్రీకి దూరమవడంతో చాలా మంది అభిమానులు నిరాశ చెందారు.ఇంతకీ ఆమె సినిమాలకు దూరం కావడానికి కారణం రూ.10 కోట్లకు ఆశపడి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈమె గతంలో ముంబైకి చెందిన సెలబ్రెటీ మేనేజ్మెంట్ కంపెనీలో చేరగా ఆ కంపెనీతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది.ఆ ఒప్పందం ఏంటంటే.ఏడాదిపాటు కంపెనీ ఆధీనంలో ఉండాలని అందుకు తనకు 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషకం ఉంటుందని తెలిపారు.

దీంతో అప్పటి నుంచి తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీకి దూరమై ఆ కంపెనీ నిర్దేశించిన షెడ్యూల్స్ లోనే ఆమె నటించాలి అని ఒప్పందం తీసుకున్నారు.దీంతో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఆమె అందులో ఒప్పందం తీసుకోవడంతో తన కెరీర్ ను తన చేతులారా నాశనం చేసుకుంది.ఇక పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవ్వగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, తన కూతురు ఫోటో లను అభిమానులతో బాగా పంచుకుంటుంది.ఇక ఇప్పటికీ ఈమె అభిమానులు ఈమె రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

#Tamil #AmmaNanna #AsinCareer #Queen Kollywood #Asin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు