నేడు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.కెరీర్ తొలినాళ్లలో హిట్లు లేకపోయినా ఐరన్ లెగ్ అనే విమర్శలు వ్యక్తమైనా తర్వాత రోజుల్లో వరుసగా విజయాలను సొంతం చేసుకుని శృతిహాసన్ సత్తా చాటారు.
తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించిన శృతి హాసన్ కు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతోంది.ఈరోజు శృతిహాసన్ తన 36వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
కమల్ హాసన్ కూతురు కావడంతో సినిమాల్లోకి శృతి హాసన్ సులభంగానే ఎంట్రీ ఇచ్చినా తన టాలెంట్ తో ఆమె సక్సెస్ సాధించారు.బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించిన శృతి సినిమాను, హీరోను బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా శృతిహాసన్ తనకు యోగా అంటే నచ్చదని స్విమ్మింగ్, డ్యాన్సింగ్ ను మాత్రం తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చారు.మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ను తాను బాగా ఎంజాయ్ చేస్తానని ఆమె కామెంట్లు చేశారు.
సీతాఫలాలు, చెర్రీలు తనకు ఇష్టమని పూల విషయానికి వస్తే రోజా పూలు, లిల్లీ పూలు ఇష్టమని శృతి హాసన్ కామెంట్లు చేశారు.
వడ, దోసె, సాంబార్, రసం ఇష్టమైన ఆహారాలు అని శృతి హాసన్ వెల్లడించారు.పియానో ఫేవరెట్ అని గిటార్ సౌండింగ్ అంటే కూడా ఇష్టమని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.శృతి హాసన్ ఈనాడు అనే సినిమాకు కూడా మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే.
ఈనాడు తమిళ వెర్షన్ కు శృతి మ్యూజిక్ అందించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.గబ్బర్ సింగ్ సినిమా తర్వాత శృతి హాసన్ కెరీర్ పుంజుకుంది.జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా శృతి హాసన్ రామయ్యా వస్తావయ్యా సినిమాలో నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో సీనియర్ హీరోలకు కూడా జోడీగా నటిస్తున్నారు.