ఆ సినిమా చేసి చనిపోతానని ఏఎన్నార్ చెప్పారు.. శ్రియ కీలక వ్యాఖ్యలు!

Star Heroine Shriyasaran Comments About Akkineni Nageshwar Rao Details Here

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ నటీమణులలో శ్రియ సరన్ ఒకరు.రెండు దశాబ్దాలుగా సీనియర్ నటిగా కేరీర్ ను కొనసాగిస్తున్న శ్రియసరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గమనం ఈ నెల 10వ తేదీన రిలీజ్ కానుంది.

 Star Heroine Shriyasaran Comments About Akkineni Nageshwar Rao Details Here-TeluguStop.com

కల్కి ప్రొడక్షన్, క్రియ ఫిల్మ్ కార్ప్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.సంజనారావు సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు.

ఇరవై సంవత్సరాలుగా తాను ప్రేక్షకుల ముందు ఉన్నందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలని శ్రియ అన్నారు.

 Star Heroine Shriyasaran Comments About Akkineni Nageshwar Rao Details Here-ఆ సినిమా చేసి చనిపోతానని ఏఎన్నార్ చెప్పారు.. శ్రియ కీలక వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన తొలి సినిమా ఇష్టం అని అప్పటినుంచి ఇప్పటివరకు తనకు సినిమాల ద్వారా ప్రేక్షకుల వల్ల ఎంతో ప్రేమ దొరికిందని శ్రియ తెలిపారు.

తన సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధించాయని మరికొన్ని సినిమాలు సక్సెస్ సాధించలేదని అయితే చాలా సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండటం తనకు సంతోషంగా ఉందని శ్రియసరన్ పేర్కొన్నారు.నేను ఎప్పటివరకు జీవించి ఉంటానో అప్పటివరకు నటిస్తూ సినిమాలు చేస్తూ ఉంటానని శ్రియసరన్ చెప్పుకొచ్చారు.

అక్కినేని నాగేశ్వరరావు గారు చివరి క్షణం వరకు నటించారని మనం సినిమా సమయంలో నేను చనిపోతే ఈ సినిమా చేసి చనిపోతానని ఆయన నాకు చెప్పేవారని శ్రియసరన్ వెల్లడించారు.

Telugu Anr Manam, Gamanam, Shreya, Manam, Shreyagamanam, Shreya Saran, Shriya Saran-Movie

అక్కినేని నాగేశ్వరరావులా తాను కూడా చివరి నిమిషం వరకు నటిస్తూనే ఉంటానని శ్రియసరన్ పేర్కొన్నారు.తన కూతురు, కుటుంబం గర్వపడే పాత్రల్లో నటించాలని తాను అనుకుంటున్నానని శ్రియసరన్ చెప్పుకొచ్చారు.

Telugu Anr Manam, Gamanam, Shreya, Manam, Shreyagamanam, Shreya Saran, Shriya Saran-Movie

గమనం సినిమాలో దివ్యాంగురాలిగా తాను కనిపిస్తానని ఈ మూవీలో ఊహకు అందని అతీంద్రియ శక్తి ఉందని తాను నమ్ముతానని శ్రియసరన్ చెప్పుకొచ్చారు.ఈ సినిమా కోసం తెలుగులో తొలిసారి మహిళా డైరెక్టర్ డైరెక్షన్ లో నటించానని శ్రియసరన్ కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని శ్రియ కామెంట్లు చేశారు.

#ShreyaGamanam #Gamanam #Manam #Shreya #Shreya Saran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube