టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్లలో సమంత ఒకరు.పాత్రకు తగిన విధంగా కనిపించడం కోసం సమంత ఎంతో కష్టపడతారనే సంగతి తెలిసిందే.
పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. నాగచైతన్యతో వివాహం తర్వాత పాత్రల ఎంపిక విషయంలో మారిన సమంత విడాకుల ప్రకటన తర్వాత సినిమాల విషయంలో వేగం పెంచడంతో పాటు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.
బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్టులకు కూడా ఓకే చెబుతూ అభిమానులకు సమంత షాక్ ఇస్తున్నారు. తాజాగా సమంత అభిమాని కోరికను తీర్చి వార్తల్లో నిలిచారు.
పల్లవి అనే పేరు ఉన్న యువతి సమంతను కలవాలని ఆమెతో ఒక్క ఫోటో అయినా దిగాలని చాలా సంవత్సరాలుగా కోరుకుంటున్నారు.అయితే ఇండస్ట్రీలో పరిచయాలు లేకపోవడంతో పల్లవికి సమంతను కలవడం వీలు కాలేదు.
అయితే పల్లవి సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ సహాయంతో సామ్ ను కలిశారు.
అభిమాని కోరికను నెరవేర్చిన సమంతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
సమంత భవిష్యత్తులో నటించబోయే సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడం గమనార్హం.గుణశేఖర్ డైరెక్షన్ లో సమంత నటించిన శాకుంతలం షూటింగ్ చాలా నెలల క్రితమే పూర్తైంది.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
శాకుంతలం మూవీ మేకర్స్ సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.పుష్పలో స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పిన సమంత తెలుగు, తమిళ భాషలలో యశోద అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సినిమా సినిమాకు సామ్ క్రేజ్, మార్కెట్ పెరుగుతోంది.
సమంతను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే.త్వరలో శాకుంతలం రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
వచ్చే ఏడాది సామ్ నటించిన రెండు లేదా మూడు సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.