ఆ ప్రకటన వల్ల బాధ పడుతున్న సమంత.. ఎందుకు బాధిస్తుందో అర్థం కావడం లేదంటూ?

తన మనస్సులో ఉన్న భావాలను నెటిజన్లతో పంచుకోవడానికి ఇష్టపడే స్టార్ హీరోయిన్లలో సమంత ముందువరసలో ఉంటారు.సంతోషం వచ్చినా బాధ వచ్చినా సమంత వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆ విషయాలను వెల్లడిస్తారు.

 Star Heroine Samantha Social Media Post Goes Viral In Social Media Details, Hero-TeluguStop.com

భవిష్యత్తులో చేయబోయే పనులను సైతం సమంత తన పోస్టుల ద్వారా ముందుగానే చెప్పేస్తారని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడతారు.చైతన్యతో విడాకుల ప్రకటనకు ముందే సమంత సోషల్ మీడియా పోస్టుల ద్వారా కొన్ని సంకేతాలను ఇచ్చారు.

అయితే తాజాగా సమంత బ్లాక్ బెర్రీ ఫోన్ల సేవలను నిలిపివేస్తూ వచ్చిన ప్రకటన గురించి ఎమోషనల్ అయ్యారు.సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ఫాలోవర్లు ఉన్న సమంత బ్లాక్ బెర్రీ ఫోన్ల సేవల నిలిపివేతకు సంబంధించిన ప్రకటనను షేర్ చేస్తూ బ్లాక్ బెర్రీ చేసిన ప్రకటన తనను ఎంతగానో బాధిస్తోందని అయితే ఈ ప్రకటన తనను బాధించడానికి గల అసలు కారణం మాత్రం తనకు తెలియదని పేర్కొన్నారు.

తనకు బ్లాక్ బెర్రీ ఫోన్లు అంటే ఇష్టమని సమంత తన ప్రకటనతో చెప్పకనే చెప్పేశారు.

Telugu Amazon Prime, Black Berry, Blackberry, Samantha, Puahpa-Movie

సమంత స్పెషల్ సాంగ్ చేసిన పుష్ప మూవీ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుండగా థియేటర్లలో చూడకుండా ఓటీటీలో చూసిన ప్రేక్షకులు సమంత స్పెషల్ సాంగ్ గురించి పాజిటివ్ గా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.ఇన్ స్టాగ్రామ్ లో యక్టివ్ గా ఉండే సమంత ఇన్ స్టాగ్రామ్ పోస్టుల ద్వారా, స్టోరీల ద్వారా తన భావాలను వ్యక్తపరుస్తున్నారు.

Telugu Amazon Prime, Black Berry, Blackberry, Samantha, Puahpa-Movie

బ్లాక్ బెర్రీ తాజాగా చేసిన ప్రకటన వల్ల బ్లాక్ బెర్రీ ఫోన్లను ఎవరైతే వాడతారో వాళ్లు ఫోన్ కాల్స్ చేయడంతో పాటు మెసేజ్ లను పంపడం సాధ్యం కాదు.బ్లాక్ బెర్రీ ఫోన్లను వాడేవాళ్లు ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేయడం కూడా సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube