స్టార్ హీరోయిన్ సమంత బ్యాగ్, షూ ధర అన్ని లక్షలా?

ఫ్యాషన్ ను ఫాలో కావడంలో అక్కినేని కోడలు సమంత ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో సైతం సమంత యాక్టివ్ గా ఉండటంతో పాటు తరచుగా తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

 Star Heroine Samantha Shoe And Bag Price Details Here , Tollywood , Samantha , S-TeluguStop.com

తాజాగా సమంత దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ లో ఫోజులు ఇచ్చి సమంత ఆ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

లూయిస్ వుయిట్టన్ ఔట్ ఫిట్ లో సమంత సందడి చేయడం గమనార్హం.సమంత ధరించిన బ్యాగ్ ధర 2.5 లక్షల రూపాయలు కాగా బూట్ల విలువ లక్షన్నర రూపాయలు మాత్రమేనని సమాచారం.స్టైలిష్ గా సమంత హాలీవుడ్ మోడల్ లా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమంత గోవాలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది.

Telugu Samantha, Shakunthalam, Shoe Bag, Tollywood-Movie

సమంత ప్రధాన పాత్రలో పౌరాణిక పురాణ ప్రేమగాథగా తెరకెక్కిన శాకుంతలం సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైన సంగతి తెలిసిందే.తమిళంలో సమంత చేతిలో కాతువాకుల రెండు కాదల్ మూవీ ఉంది.విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది.

పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Telugu Samantha, Shakunthalam, Shoe Bag, Tollywood-Movie

సమంత దుస్తులు, బూట్ల కోసం ఎక్కువమొత్తం ఖర్చు చేస్తుండటం గమనార్హం.సమంత లుక్ దుస్తులు, బ్యాగ్ తో రెట్టింపు అయిందనే చెప్పాలి.సినిమాల ఎంపిక విషయంలో సమంత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరోవైపు సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఆ వార్తల గురించి స్పందించడానికి సమంత ఏ మాత్రం ఇష్టపడటం లేదు.

సమంత కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube