2021 ఓ క్లిష్టమైన ఏడాది.. స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ కామెంట్స్!

Star Heroine Samantha Shocking Comments About Year 2021

స్టార్ హీరోయిన్ సమంత వరుసగా సినిమాలతో బిజీ కావడంతో పాటు టీవీ షోలలో కూడా పాల్గొంటూ బిజీ అవుతున్నారు.కెరీర్ విషయంలో సమంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

 Star Heroine Samantha Shocking Comments About Year 2021-TeluguStop.com

విడాకుల ప్రకటన తర్వాత సమంత బాలీవుడ్ లో బిజీ అవుతారని అందరూ భావిస్తే హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సమంత అందరినీ ఆశ్చర్యపరిచారు.తాజాగా ఒక చిట్ చాట్ లో పాల్గొన్న సమంత ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

2021 సంవత్సరం తనకెంతో క్లిష్టమైన సంవత్సరం అని సమంత పేర్కొన్నారు.నాగచైతన్యకు విడాకులు ఇవ్వడం వల్లే సమంత ఈ విధంగా కామెంట్లు చేసి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.

 Star Heroine Samantha Shocking Comments About Year 2021-2021 ఓ క్లిష్టమైన ఏడాది.. స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమంత చేసిన కామెంట్ విని నెటిజన్లు “బీ స్ట్రాంగ్ మేడమ్” అంటూ కామెంట్లు పెడుతుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ప్రేమించి పెద్దలను ఒప్పించి చై, సామ్ పెళ్లి చేసుకోగా ఎవరూ ఊహించని విధంగా వాళ్లు విడిపోయారు.

Telugu Fil, Nagachaitanya, Samantha, Shakunthalam, Tollywood-Movie

విడాకుల తర్వాత అటు చైతన్య, ఇటు సమంత సినిమాలపరంగా బిజీ అవుతున్నారు.విడాకుల తర్వాత సమంత మానసికంగా కృంగిపోయారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఆ బాధను మరిచిపోవడానికి సమంత స్నేహితులతో కలిసి టూర్లకు వెళ్లారు.ఆ తర్వాత సమంత కెరీర్ పై దృష్టి పెట్టి సినిమాలతో బిజీ అయ్యారు.హాలీవుడ్ లో కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ సినిమాసినిమాకు సమంత క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

Telugu Fil, Nagachaitanya, Samantha, Shakunthalam, Tollywood-Movie

సోషల్ మీడియాలో సమంత హవా కొనసాగుతుండగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే సమంతకు దాదాపుగా 20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.సమంత నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ డేట్ ప్రకటన వెలువడాల్సి ఉంది.

గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

#Samantha #Shakunthalam #Nagachaitanya #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube