టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని వేర్వేరు కారణాల వల్ల విడిపోయారనే సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత వరుసగా సినిమాలతో బిజీ అవుతున్న సమంత ఆ సినిమాలతో విజయాలను అందుకోవడంతో పాటు మళ్లీ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటాలని భావిస్తున్నారు.
అయితే తాజాగా సమంత ప్రేమపై షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన సమంత ప్రేమ, ద్వేషం లాంటి విషయాలలో మళ్లీ పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.
ప్రేమకు, ద్వేషానికి దూరంగా ఉండటం చాలా మంచిదని ఆమె కామెంట్లు చేశారు.శాకుంతలం, యశోద సినిమాలలో నటించిన సమంత ఈ ఏడాదే ఆ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కి గత నెలలో రిలీజైన కణ్మణి రాంబో ఖతీజా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.
శాకుంతలం, యశోద సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాల ఫలితాలను బట్టి సమంత మార్కెట్ డిసైడ్ కానుంది.శాకుంతలం సినిమాలో దుశ్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తుండగా ఈ నటుడికి బదులుగా తెలుగు నటుడిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హిందీలో కూడా సమంత ఒక సినిమాకు ఓకే చెప్పారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
యంగ్ హీరోయిన్ల నుంచి సమంతకు గట్టి పోటీ ఎదురవుతుండగా సమంత పోటీలో నెగ్గుతారో లేదో చూడాల్సి ఉంది.కెరీర్ తొలినాళ్లలో తక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా తీసుకున్న సమంత ప్రస్తుతం భారీగానే డిమాండ్ చేస్తున్నారు.విడాకుల తర్వాత కూడా సమంతకు ఏ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గకపోవడం గమనార్హం.సమంతను కోట్ల సంఖ్యలో అభిమానులు అభిమానిస్తూ ఉండటం గమనార్హం.