విడాకుల తర్వాత సమంత నిర్ణయం ఇదే.. వాళ్లకు టచ్ లో ఉంటూ?

స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత నాగచైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటన చేసిన తర్వాత ఆమె ఏ విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారని ప్రశ్నలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.పెళ్లికి ముందుతో పోలిస్తే పెళ్లి తర్వాత సమంతకు ఆఫర్లు తగ్గాయి.

 Star Heroine Samantha Sensational Decision About Future Projects , Future Projec-TeluguStop.com

నాగచైతన్యతో బంధం తెగిపోవడానికి సమంత సినిమాల్లో కొనసాగాలని తీసుకున్న నిర్ణయం కూడా ఒక కారణమనే కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి.

సమంత ఇప్పటికే కెరీర్ ను సరైన విధంగా ప్లాన్ చేసుకోవడానికి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇతర ఇండస్ట్రీల్లో కూడా సమంత రాణించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే తెలుగులో వచ్చిన స్థాయిలో ఇతర భాషల్లో సమంతకు గుర్తింపు లేదు.

మరోవైపు సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆసక్తి చూపినా ఆ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అవుతాయనే గ్యారంటీ లేదు.

సమంత ప్రస్తుతం కొందరు దర్శకులకు టచ్ లోకి వెళుతున్నారని తెలుస్తోంది.

టాలివుడ్ లో కొత్త ప్రాజెక్టులు ఇప్పటికిప్పుడు ఓకే కావడం కష్టం అయినా సమంత కొత్త ఆఫర్ల కోసం తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.మరోవైపు శాకుంతం రిజల్ట్ పైనే సమంత కెరీర్ ఆధారపడి ఉంటుందని మెజారిటీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

శాకుంతం సక్సెస్ సాధిస్తే ఒక విధంగా ఫ్లాప్ అయితే మరో విధంగా సమంత కెరీర్ ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Projects, Samantha, Sensational-Movie

టాలీవుడ్ లో సమంతకు ఆఫర్లు రాకపోతే మాత్రం ఇతర ఇండస్ట్రీలలో కూడా సమంతకు కొత్త ఆఫర్లు రావడం కష్టమని చెప్పవచ్చు.సమంతతో విడిపోయినట్టు చేసిన ప్రకటన వల్ల చైతన్య కెరీర్ కు మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది.సమంత కెరీర్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.

సినిమాల ద్వారా సమంత 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా సంపాదించారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube