రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. విజయ్ సినిమాకు ఎంత తీసుకుంటున్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో రెమ్యునరేషన్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారనే సంగతి తెలిసిందే.స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ను తీసుకుంటున్న నేపథ్యంలో సమంత కూడా తాజా సినిమాకు రెమ్యునరేషన్ ను పెంచేశారు.

 Star Heroine Samantha Remuneration For Vijay Movie Details, Samantha, Vijay Deva-TeluguStop.com

విజయ్ దేవరకొండ సినిమా కొరకు సమంత ఏకంగా మూడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సమంత ఏకంగా కోటిన్నర రూపాయల పారితోషికం తీసుకుని వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమాలో సమంతనే హీరోయిన్ కాగా విజయ్ సినిమా కోసం కూడా దర్శకుడు ఆమెనే ఎంపిక చేసుకోవడం గమనార్హం.

టక్ జగదీష్ సక్సెస్ సాధించకపోవడంతో తర్వాత సినిమాతో శివ నిర్వాణ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

విజయ్ సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

Telugu Shiva Nirvana, Nayanthara, Pooja Hegde, Rashmika, Samantha, Samanthavijay

వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తున్న సమంత కథ నచ్చితే స్టార్ హీరోలతో కలిసి నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక్కో సినిమాకు మూడున్నర కోట్ల రూపాయలకు అటూఇటుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Telugu Shiva Nirvana, Nayanthara, Pooja Hegde, Rashmika, Samantha, Samanthavijay

మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా రెమ్యునరేషన్ మూడు కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది.సౌత్ ఇండియాలో ప్రస్తుతం నయనతార నాలుగైదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే సమంత రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ ఉంది.సినిమాసినిమాకు స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ ను పెంచుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube