ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ కు సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్ లెక్కలు మారిపోతున్నాయి.డిమాండ్ కు అనుగుణంగా నటీనటులు తమ రెమ్యునరేషన్లను తీసుకుంటున్నారు.

 Star Heroine Samantha Remuneration For Family Man 2 Web Series, Four Crore Rupee-TeluguStop.com

ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.రాజ్, డీకే దర్శకత్వ ప్రతిభతో ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యేలా చేశారు.

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రేక్షకులకు ఈ వెబ్ సిరీస్ ద్వారా ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది.

ది ఫ్యామిలీ మేన్ 2 ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది.

హాలీవుడ్ స్థాయిలో ఉందనే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్ రెమ్యునరేషన్స్ పై సోషల్ మీడియాలో గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి.అయితే మనోజ్ బాజ్ పాయ్ ఈ వెబ్ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.

సమంత విషయానికి వస్తే సమంత ఈ వెబ్ సిరీస్ కొరకు 3.5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.

Telugu Crore Rupees, Actors, Manoj Bajpay, Priyamani, Samantha-Movie

వెబ్ సిరీస్ రిలీజ్ కు ముందు సమంత పాత్ర వివాదంలో చిక్కుకోవడంతో ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ప్రియమణి ఈ వెబ్ సిరీస్ కోసం 80 లక్షల రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో నటించిన మిగతా సెలబ్రిటీలకు తక్కువ మొత్తం రెమ్యునరేషన్ అందిందని తెలుస్తోంది.

Telugu Crore Rupees, Actors, Manoj Bajpay, Priyamani, Samantha-Movie

సినిమాలకు సమానంగా సినిమాలోని ప్రధాన పాత్రధారులకు రెమ్యునరేషన్ దక్కటం గమనార్హం.సమంత సినిమాలలో నటిస్తూనే వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.తెలుగులో మిగతా హీరోయిన్లతో పోల్చి చూస్తే సమంత ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube