సమంత సంచలనం.. ఆ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్..?

స్టార్ హీరోయిన్ సమంత ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లోని రాజీ పాత్రతో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది.ఈ వెబ్ సిరీస్ కోసం 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న సమంతకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి వెబ్ సిరీస్ లో నటించడానికి ఆఫర్ వచ్చింది.

 Star Heroine Samantha Remuneratin For Netflix Webseries-TeluguStop.com

అయితే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ కోసం సమంత ఏకంగా 8కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ పారితోషికం మిగతా హీరోల పారితోషికం కంటే ఎక్కువ కావడం గమనార్హం.

ఏ మాయ చేశావె సినిమా నుంచి ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ వరకు తన నటనతో ప్రేక్షకులను మాయ చేస్తున్న సమంత అవకాశాలను బాగానే అందిపుచ్చుకుంటున్నారు.తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

 Star Heroine Samantha Remuneratin For Netflix Webseries-సమంత సంచలనం.. ఆ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ తో సమంత ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

తెలుగుతో పాటు తమిళంలో కూడా హిట్లు సాధిస్తూ సమంత సత్తా చాటుతున్నారు.ఫ్యామిలీ మే2 వెబ్ సిరీస్ లో రాజీ పాత్రను వివాదాలు చుట్టుముట్టినా వెబ్ సిరీస్ కు సమంతనే హైలెట్ కావడం గమనార్హం.సమంత తన సినీ కెరీర్ లో తొలిసారి బోల్డ్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

ప్రస్తుతం శాకుంతలం సినిమాలో మాత్రమే నటిస్తున్న సమంత ఓటీటీ దిగ్గజాలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఒక బాలీవుడ్ డైరెక్టర్ సమంత వెబ్ సిరీస్ కు డైరెక్షన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.టాలీవుడ్ మీడియం హీరోలను మించి పారితోషికం తీసుకుంటున్న సమంత భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

#StarHeroine #Netflix #SamanthaNetflix #TheFamily #8 Crore Rupees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు