ఈగోను అక్కడే వదిలేయమంటున్న సామ్.. ఆ కామెంట్ల వెనుక అర్థం ఇదేనా?

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో ఏ చిన్న పని చేసినా ఆ పని సంచలనం అవుతోందనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా విడాకుల పోస్ట్ ను డిలీట్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురయ్యేలా చేశారు.

 Star Heroine Samantha Interesting Comments About About Ego , Ego , Samantha , Swing Game , Yashoda Movie , Switzerland , Social Media-TeluguStop.com

తాజాగా ఈ హీరోయిన్ ఈగోను వదిలేయాలంటూ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.గతేడాది ఊ అంటావా ఊహూ అంటావా పాటతో సమంత వార్తల్లో నిలిచారు.

బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా సమంతకు సినిమా ఆఫర్లు వచ్చాయని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.సమంత నటిస్తున్న యశోద సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది.

 Star Heroine Samantha Interesting Comments About About Ego , Ego , Samantha , Swing Game , Yashoda Movie , Switzerland , Social Media-ఈగోను అక్కడే వదిలేయమంటున్న సామ్.. ఆ కామెంట్ల వెనుక అర్థం ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఉన్న సమంత స్విట్జర్లాండ్ టూర్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.అక్కడ స్వింగ్ అనే ఆటను ఆడుతూ ఆ ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.

స్కేటింగ్ ను పోలి ఉండే స్వింగ్ ఆటను అద్భుతంగా ఆడుతూ ఆ ఆటకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.సమంత షేర్ చేసిన పోస్ట్ లో అహాన్ని ఇంటిదగ్గరే వదిలేయాలని వారు చెప్పారని ఎంత కరెక్ట్ గా చెప్పారో కదా అంటూ చెప్పుకొచ్చారు.

సమంత గతంలో తాను ఏ విషయాన్ని చెప్పాలని అనుకున్నా ముందుగానే హింట్స్ ఇస్తానని ఒక సందర్భంలో కామెంట్లు చేశారు.

సమంత అహాన్ని వదిలేయాలంటూ తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చైసామ్ జంట కలిస్తే అభిమానులు సైతం ఎంతో ఆనందిస్తారు.మరి చైతన్య సమంతల జంట కలుస్తుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

చైతన్య కూడా విడాకుల పోస్ట్ ను డిలీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube