నువ్వు నన్ను బాధ పెట్టి ఉండొచ్చు.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్!

స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు సొషల్ మీడియా ద్వారా తన మనస్సులోని భావాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.రెండు రోజుల క్రితం తిరుమలలో రూమర్ల గురించి స్పందించాలని సమంతను జర్నలిస్ట్ కోరగా గుడికి వచ్చి బుద్ధుందా అంటూ సమంత చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

 Star Heroine Samantha Instagram Status Post Goes Viral In Social Media-TeluguStop.com

కొంతమంది సమంతను సమర్థిస్తే సమంత చేసిన వ్యాఖ్యలు సరికావని మరికొందరు విమర్శించారు.

అయితే తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 Star Heroine Samantha Instagram Status Post Goes Viral In Social Media-నువ్వు నన్ను బాధ పెట్టి ఉండొచ్చు.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ పోస్ట్ లో సమంత నువ్వు నన్ను బాధపెట్టి ఉండవచ్చని నేను కూడా నిన్ను బాధపెట్టి ఉండవచ్చని ఒకరినొకరం బాధ పెట్టుకుని ఉండవచ్చని మొత్తానికి రియాలిటీ మాత్రం ఇదేనని పేర్కొన్నారు.వసంతం కావాలంటే శిశిరంను కూడా అనుభవించాలని ఆమె చెప్పుకొచ్చారు.

సమంత వేర్వేరు కోట్స్ తో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

నెటిజన్లలో చాలామంది సమంత నాగచైతన్యను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారని అభిప్రాయపడుతున్నారు.

Telugu Akkineni, Goes Viral, Instagram Post, Naga Chaitanya, Samantha, Samantha Viral Post, Samantha-naga Chaitanya, Social Media, Tollywood-Movie

సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి పోస్ట్ లు పెట్టినా నెటిజన్లు పెద్దగా పట్టించుకోరు.ఈ మధ్య కాలంలో సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో అక్కినేని పేరును తొలగించడం, సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడంతో సమంత పెట్టిన పోస్టుల గురించి నెటిజన్ల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.

Telugu Akkineni, Goes Viral, Instagram Post, Naga Chaitanya, Samantha, Samantha Viral Post, Samantha-naga Chaitanya, Social Media, Tollywood-Movie

సమంత ఇన్ స్టా స్టేటస్ లలో పెట్టిన మెసేజ్ కార్డులను చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.సమంత పబ్లిక్ డొమైన్ లలో పోస్టులు పెడుతుండటంతో సమంత చైతన్య మధ్య ఏం జరుగుతుందో నెటిజన్లకు అర్థం కావడం లేదు.త్వరలోనే సమంత చైతన్యల రిలేషన్ షిప్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

#SamanthaNaga #Samantha #Akkineni #Samantha #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు