టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.సమంత గ్లామర్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
అయితే సమంత ఫిట్ నెస్ కు కూడా అదేస్థాయిలో అభిమానులు ఉండటం గమనార్హం.ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన సమంత ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ కొంత సమయం అయినా జిమ్ లో గడుపుతారు.
ఫిట్ నెస్ వల్లే సమంతకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయని చాలామంది భావిస్తారు.
హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సమంతకు ఆఫర్లు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా సమంత తన ఫిట్ నెస్ సీక్రెట్ ను చెప్పుకొచ్చారు.తాజాగా సామ్ ఇన్స్టాగ్రామ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో పోస్ట్ చేయడంతో పాటు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
తన ఫిట్ నెస్ సీక్రెట్ సమోసా అని ఆమె పేర్కొన్నారు.తనకు సమోసాలు అంటే చాలా ఇష్టమని ఆమె వెల్లడించారు.
అయితే ఎంతో ఇష్టమైన సమోసాలను ఫిట్ నెస్ వల్ల తినలేకపోతున్నానని సామ్ పేర్కొన్నారు.
అందువల్ల సమోసాను ఎదురుగా పెట్టుకుని వర్కౌట్లు చేస్తున్నానని సామ్ చెప్పుకొచ్చారు.
మొదట శరీరంలోని కేలరీలను కరిగిస్తానని ఆ తర్వాత సమోసా తింటానని సామ్ చెబుతున్నారు.సమోసాల వల్లే గంటల సమయం జిమ్ చేస్తున్నానని సామ్ చెప్పకనే చెప్పేశారు.సమంత తన అభిమానులతో ఒక సామెతను కూడా పంచుకున్నారు.తినే ఫుడ్ పైనే మన శరీరం, ఆలోచనలు, మనస్సు ఆధారపడి ఉంటాయని సామ్ పేర్కొన్నారు.

సమంత నటిస్తున్న యశోద, కాతువాకుల రెండు కాదల్ సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.కొన్ని భారీ సినిమాలకు సైతం స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇతర హీరోయిన్లు సైతం అవాక్కయ్యేలా సమంత వరుసగా సినిమాలలో నటిస్తున్నారు.