ఏడుస్తూ క్యారవాన్ లోకి వెళ్లిపోయిన సమంత.. ఎందుకంటే..?

స్టార్ హీరోయిన్ సమంత ప్రతిభ పుష్కలంగా ఉన్న నటి అనే సంగతి తెలిసిందే.ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించి ప్రశంసలు అందుకునే టాలెంట్ సమంత సొంతం.

 Star Actress Samantha Crying In Family Man 2 Shooting Time, Family Man 2, Amazon-TeluguStop.com

సినీ కెరీర్ లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో నటించిన సమంత ఈ మధ్య కాలంలో పేరు తెచ్చిపెట్టే పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.సమంత నటిస్తున్న ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ ఇప్పటికే అనేక రిలీజ్ డేట్లను మార్చుకున్న సంగతి తెలిసిందే.

అయితే ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనల గురించి తాజాగా ఆ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన రాజ్ డీకేలు చెప్పుకొచ్చారు.ఫ్యామిలీ మాన్ సీజన్ 1 సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.

సీజన్ 1 హిట్ కావడంతో సీజన్ 2పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.సమంత ఈ వెబ్ సిరీస్ లో ఉగ్రవాదిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించడం గమనార్హం.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఈ వెబ్ సిరీస్ రిలీజ్ వాయిదా పడింది.

Telugu Directors, Shades, Raj Dk, Samantha, Samantha Cried, Terrorist Role-Movie

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో డీగ్లామరస్ లుక్ లో సమంత హైలెట్ అయ్యారు.సమంత ఒక సీక్వెన్స్ లో నటించిన సమయంలో తెగ ఏడ్చేశారని రాజ్ డీకే వెల్లడించారు.సీక్వెన్స్ ను చూసి సమంత ఏడ్చుకుంటూ కారవాన్ లోకి వెళ్లిపోయారని రాజ్ డీకే చెప్పుకొచ్చారు.

కొంత సమయం తరువాత ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుని సమంత బయటకు వచ్చారని రాజ్ డీకే తెలిపారు.

ఈ పాత్ర కోసం చాలామందిని పరిశీలించి చివరకు సమంతను ఫైనల్ చేశామని రాజ్ డీకే చెప్పుకొచ్చారు.

సమంత కోసమే ఉన్నట్టు సమంత నటించిన పాత్ర ఉంటుందని రాజ్ డీకే వెల్లడించారు.అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube