టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేకమననే సంగతి తెలిసిందే.హిట్లు ఫ్లాపులకు అతీతంగా సినిమాలను ఎంచుకుంటున్న సమంత అక్కినేని కోడలు అయిన తరువాత సినిమాలను ఎంపిక చేసుకుంటున్న విధానాన్ని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
కొన్ని నెలల క్రితం వరకు సమంత క్రేజ్ సౌత్ ఇండియాకే పరిమితం కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా సమంత పాపులారిటీని తెచ్చుకున్నారు.
ది ఫ్యామిలీ మేన్2 తో సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదకొండు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సమంత తాజాగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పదకొండు సంవత్సరాల ప్రయాణాన్ని చూస్తే ఎలా అనిపిస్తుందనే ప్రశ్నకు స్పందిస్తూ నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన సమయంలో తనకు అనేక సందేహాలు ఉండేవని సమంత అన్నారు.

అయితే ఆ సందేహాల నుంచే తాను పాఠాలను నేర్చుకుంటూ వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.తన సినీ కెరీర్ లో తాను ఎన్నో కఠినమైన సవాళ్లను స్వీకరించానని సమంత తెలిపారు.తాను ఆ సవాళ్లను చివరకు అధిగమించానని తాను ప్రస్తుతం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని సమంత పేర్కొన్నారు.ఇప్పటివరకు స్వీకరించిన సవాళ్లతో పోలిస్తే పెద్ద సవాళ్లను స్వీకరించడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు.

ధైర్యంగా ఎదుర్కోవడం మాత్రమే సవాళ్లను ఎదుర్కోవడానికి ఉన్న ఏకైన మార్గమని సమంత చెప్పుకొచ్చారు.సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్న సమంత తెలుగులో శాకుంతలం మూవీలో నటిస్తున్నారు.ఈ మూవీలో సమంత శకుంతల పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.సమంతకు జోడీగా ఈ మూవీలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.