అయ్యో దేవరే.. సమంత ధరించిన ఈ చెప్పుల ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) నటించిన యశోద, శాకుంతలం సినిమాలు కమర్షియల్ గా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోకపోయినా సమంతకు సినిమాలు, వెబ్ సిరీస్( Web series ) లలో ఆఫర్లు వస్తున్నాయి.తన కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోలకు జోడీగా నటించడానికి కూడా సమంత ఓకే చెబుతుండటం గమనార్హం.

 Star Heroine Samantha Chappal Price Details Here Goes Viral In Social Media , Br-TeluguStop.com

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి( Khushi ) సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

సమంత బెస్ట్ ఫ్రెండ్స్ లో నందినీ రెడ్డి ( Nandini Reddy )ఒకరు కాగా ఆమె డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే ఈ ప్రాజెక్ట్ లో సమంత నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అన్నీ మంచి శకునములే సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న నందినీ రెడ్డి తర్వాత సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సమంత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.

Telugu Chappal, Khushi, Samantha, Web-Movie

అయితే సమంత తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించగా సామ్ కు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.బ్లాక్ జాకెట్ ను నడుముకు కట్టుకుని ముఖానికి మాస్క్ ధరించి స్టైల్ గా కళ్లద్దాలు పెట్టుకుని తన లుక్ తో సామ్ ఆకట్టుకున్నారు.ఈ ఫోటోలో సమంత సాధారణ బ్లాక్ చెప్పులను ధరించగా ఆ చెప్పుల ఖరీదు తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.

ఈ చెప్పుల ఖరీదు ఏకంగా రెండు లక్షల 58 వేల 97 రూపాయలు కావడం గమనార్హం.

Telugu Chappal, Khushi, Samantha, Web-Movie

బ్రో( Bro ) సినిమాలో పవన్ ధరించిన షూ ఖరీదు లక్ష రూపాయలు అని తెలిసి నెటిజన్లు షాక్ కాగా సమంత తన చెప్పుల ద్వారా మరింత ఆశ్చర్యపరిచారు.సమంత తన చెప్పుల కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారంటే ఆమె ఆదాయం ఏ రేంజ్ లో ఉందో సులువుగా అర్థమవుతుంది.శాకుంతలం సినిమాకు సమంత ఏకంగా 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube