ఆ సినిమా కోసం తల్లి కాబోతున్న హీరోయిన్ సమంత.. కానీ?

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల ప్రకటనకు ముందు ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన సమయంలో కూడా ఈ తరహా ప్రశ్నలు ఎదురయ్యాయి.

 Star Heroine Samantha Become Pregnant For Yashoda Movie But Details, Samantha, Pregnant Role, Samantha Yashoda Movie, Director Hari Harish, Varalakshmi Sharath Kumar, Naga Chaitanya, Divorce, Samantha Pregnant Role-TeluguStop.com

ఆ ప్రశ్నలు వినీవినీ విసుగొచ్చిన సమంత కొన్ని సందర్భాల్లో వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.అయితే ప్రస్తుతం సమంత సినిమా కోసం తల్లి కాబోతున్నారు.

యశోద సినిమాలో కొంత సమయం పాటు సమంత తల్లిగా కనిపించనున్నారు.

 Star Heroine Samantha Become Pregnant For Yashoda Movie But Details, Samantha, Pregnant Role, Samantha Yashoda Movie, Director Hari Harish, Varalakshmi Sharath Kumar, Naga Chaitanya, Divorce, Samantha Pregnant Role-ఆ సినిమా కోసం తల్లి కాబోతున్న హీరోయిన్ సమంత.. కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా ఈతరం హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు తల్లి పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపరు.

అయితే సమంత మాత్రం కథ నచ్చితే తల్లి పాత్రలో, ఇతర ప్రయోగాత్మక పాత్రలలో కనిపించడానికి వెనుకాడటం లేదు.మనం, పోలీసోడు సినిమాలలో సమంత తల్లి పాత్రలలో నటించి మెప్పించారు.

అయితే యశోద సినిమాలో వృత్తిరిత్యా నర్స్ గా కనిపించనున్న సమంత కొంత సమయం గర్భవతిగా మరికొంత సమయం తల్లిగా కనిపించనున్నారు.

భారీ బడ్జెట్ తో యశోద సినిమా తెరకెక్కుతుండగా ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుంది.

Telugu Pregnant, Hari Harish, Divorce, Naga Chaitanya, Samantha, Yashoda-Movie

విడాకుల ప్రకటన తర్వాత సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో యశోద సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.కొత్త దర్శకులు హరి హరీశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

Telugu Pregnant, Hari Harish, Divorce, Naga Chaitanya, Samantha, Yashoda-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలలో నటించే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా గుర్తింపుతో పాటు విజయాలను సొంతం చేసుకోవడంతో నటిగా సమంతకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.సమంతకు సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube