నటి రోజా ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా..?

ఒకవైపు బుల్లితెరపై షోలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ రోజా బిజీగా ఉన్నారు.కొన్ని రోజుల క్రితం రెండు సర్జరీలు చేయించుకున్న రోజా ప్రస్తుతం ఇంటి నుంచే నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు.

 Star Heroine Roja Favorite Movie Details-TeluguStop.com

తనకు ప్రజల్లో పాపులారిటీ రావడానికి జబర్దస్త్ షో కూడా కారణం కావడంతో ఆ షోకు జడ్జిగా రోజా కొనసాగుతున్నారు.

అయితే భారీ సంఖ్యలో సినిమాల్లో నటించిన రోజా ఫేవరెట్ మూవీ మాత్రం తను హీరోయిన్ గా నటించిన మూవీ కాకపోవడం గమనార్హం.

 Star Heroine Roja Favorite Movie Details-నటి రోజా ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో ఒక సందర్భంలో ఫేవరెట్ మూవీకి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా అన్నమయ్య సినిమా తనకు ఫేవరెట్ మూవీ అని రోజా చెప్పుకొచ్చారు.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించగా రమ్యకృష్ణ, కస్తూరి హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాలో రోజా హీరోయిన్ గా నటించకపోయినా ఒక చిన్న పాత్రలో నటించారు.

Telugu Annamayya, Director Raghavendra Rao, Favoruite Movie Details, Jabardasth, Kasturi, Lock Down, Nagari Constitution, Nagarjuna, Ramyakrishna, Roja, Roja Favorite Movie, Roja In Annamayya Movie, Telangana-Movie

సినిమాలో పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత లేకపోయినా స్వామిపై ఉన్న భక్తి, రాఘవేంద్రరావు డైరెక్షన్ కావడంతో ఆ సినిమాలో నటించానని రోజా వెల్లడించారు.ఆ సినిమాలో రోజా రాకుమారి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.తన కెరీర్ కు ఈ పాత్ర చాలా ఉపయోగపడిందని రోజా వెల్లడించడం గమనార్హం.

నాగార్జున సినీ కెరీర్ లో కూడా ఈ సినిమా ప్రత్యేక సినిమాగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.మరోవైపు రోజా జబర్దస్త్ లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో టీవీ షూటింగ్ లు కూడా ఆగిపోయినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం రోజాకు బదులుగా ఇంద్రజ జబర్దస్త్ షోకు జడ్జిగా హాజరవుతున్నారు.జబర్దస్త్ లోకి రోజా ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.

#RojaFavorite #Ramyakrishna #Telangana #FavoruiteMovie #Kasturi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు