ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న రష్మిక.. పాపం అంటూ?

నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న రష్మిక వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.గతేడాది పుష్ప ది రైజ్ సినిమాతో రష్మిక కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.

 Star Heroine Rashmika Health Issues Details Here Goes Viral , Rashmika, Health I-TeluguStop.com

డీ గ్లామరస్ రోల్ లో నటించినా రష్మిక తన నటనతో మెప్పించారు.పుష్ప సినిమాలోని సాంగ్స్ లో రష్మిక వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా సామీ సామీ సాంగ్ లో రష్మిక వేసిన స్టెప్పులు నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి.అయితే తాజాగా రష్మిక ప్రముఖ డాక్టర్లలో ఒకరైన గురువారెడ్డి గారిని కలిశారు.

రష్మిక ఈ డాక్టర్ ను కలవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.అయితే రష్మిక మోకాళ్ల నొప్పులతో బాధ పడుతుండటం వల్లే తనను కలిసినట్టు గురువారెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం గమనార్హం.

సామి సామి అంటూ మోకాళ్ల మీద బరువంతా వేసి డ్యాన్స్ చేయడం వల్లే నొప్పులు వచ్చాయని రష్మికకు చెప్పానని గురువారెడ్డి తన పోస్ట్ లో పేర్కొన్నారు.పుష్ప సినిమా చూసిన తర్వాత రష్మికను అభినందించాలని అనుకున్నానని ఆమె మోకాలి నొప్పి వల్ల ఆమెను అభినందించడం సాధ్యమైందని గురువారెడ్డి అన్నారు.

బన్నీ కూడా త్వరలో భుజం నొప్పితో తన దగ్గరకు వస్తాడేమో అంటూ డాక్టర్ సెటైర్ వేయడం గమనార్హం.

Telugu Alla Arjun, Gurava Reddy, Pushpa, Rashmika, Tollywood-Movie

ఫోటోలో రష్మిక నవ్వుతూ చాలా అందంగా కనిపించారు.చిన్న వయస్సులోనే రష్మికకు మోకాలి నొప్పులు రావడంతో పాపం అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.యాక్టర్ కు అయినా డాక్టర్ తో అవసరం తప్పదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాసినిమాకు రష్మికకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube