విజయ్ దేవరకొండతో అలాంటి రిలేషన్.. రష్మిక ఏం చెప్పిందంటే..?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు.ఈ సినిమాల్లో గీతా గోవిందం అంచనాలను మించి సక్సెస్ సాధిస్తే డియర్ కామ్రేడ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

 Rashmika Mandanna Comments About Relationship With Hero Vijay Devarakonda, Rashm-TeluguStop.com

అయితే విజయ్, రష్మిక మధ్య ఏదో ఉందని గతంలో కొన్ని గాసిప్స్ వైరల్ కాగా విజయ్, రష్మిక ఆ వార్తల గురించి స్పందించి స్పష్టతనిచ్చారు.తాజాగా రష్మిక సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో ముచ్చటించారు.

కన్నడ బ్యూటీ అయిన రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.అయితే విజయ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని ఆమె వెల్లడించారు.

విజయ్ దేవరకొండ తన బెస్ట్ ఫ్రెండ్ అని రష్మిక పేర్కొన్నారు.విజయ్ దేవరకొండతో దిగిన ఫోటోలలో స్పెషల్ ఫోటో ఇదేనంటూ రష్మిక ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

Telugu Allu Arjun, Friend, Pushpa, Ship-Movie

రష్మిక షేర్ చేసిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఒక నెటిజన్ స్మోకింగ్ చేస్తారా అని ప్రశ్నించగా రష్మిక తాను స్మోకింగ్ చేయనని చెప్పారు.పొగ తాగేవాళ్లకు తాను దూరంగా ఉంటానని రష్మిక తెలిపారు.హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్న రష్మిక తెలుగులో పుష్ప సినిమాలో నటిస్తున్నారు.పుష్ప మూవీలో రష్మిక అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

Telugu Allu Arjun, Friend, Pushpa, Ship-Movie

అల్లు అర్జున్ డెడికేషన్ గురించి మాట్లాడిన రష్మిక బన్నీ కెమెరా వెనుక ఎంతో సరదాగా ఉంటాడని చెప్పారు.కెమెరా ముందు మాత్రం బన్నీ పాత్రలోకి వెళ్లిపోయి ప్రొఫెషనల్ గా మారిపోతారని రష్మిక చెప్పుకొచ్చారు.బన్నీతో కలిసి నటించడం సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు.

పుష్పతో రష్మిక మరో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube