సింగిల్ లైఫ్ పై షాకింగ్ కామెంట్లు చేసిన రష్మిక.. అనేక లాభాలున్నాయంటూ?

సినిమా రంగంలో హీరోగా లేదా హీరోయిన్ గా రాణించాలంటే తప్పనిసరిగా అదృష్టం ఉండాలి.అందం, అభినయం, అదృష్టంతో విజయాలను సొంతం చేసుకుంటున్న రష్మిక యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్నారు.

 Star Heroine  Rashmika Bold Statements About Single Life, Rashmika , Pushpa, Tol-TeluguStop.com

రష్మిక పలు సందర్భాల్లో వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారనే విషయం తెలిసిందే.డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ గా పేరును సొంతం చేసుకున్న రష్మిక పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ ను సైతం ఎదుర్కొన్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న రష్మిక తను నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితం కావాలని అనుకుంటున్నారు.రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి కొన్ని కారణాల వల్ల ఎంగేజ్ మెంట్ ను బ్రేక్ చేసుకున్న రష్మిక తాజాగా సింగిల్ లైఫ్ గురించి మట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సింగిల్ లైఫ్ ను తాను చాలా ఎంజాయ్ చేస్తున్నానని రష్మిక తెలిపారు.

Telugu Aadavaallumeeku, Career, Pushpa-Movie

ఒంటరితనంను అనుభవించడంతో పాటు ఆనందించడం ద్వారా కెరీర్ లో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె కామెంట్లు చేశారు.పుష్ప, ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమాలలో నటిస్తున్న రష్మిక నెటిజన్లలో ఎవరైనా ట్రోల్ చేసినా ఘాటుగా జవాబిస్తూ ట్రోల్ చేసిన నెటిజన్లకు చుక్కలు చూపిస్తున్నారు.తరచూ సెన్సేషనల్ కామెంట్లు చేస్తూ ఆ కామెంట్ల ద్వారా రష్మిక క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

Telugu Aadavaallumeeku, Career, Pushpa-Movie

సోషల్ మీడియాలో సైతం రష్మికకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.బాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న రష్మిక ఆ సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.అల్లు అర్జున్ కు తొలిసారి జోడీగా రష్మిక పుష్ప మూవీలో నటిస్తున్నారు.రియల్ లైఫ్ లో ఎంతో అందంగా కనిపించే రష్మికను సుకుమార్ డీగ్లామర్ గా చూపిస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube