టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు!  

హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్..

Star Heroine Rakul Preet Singh Brother Launching In Tollywood As A Hero-

టాలీవుడ్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది.వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రస్తుతం వున్న స్టార్ హీరోలంధరితో జతకట్టింది.ఇక ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు సినిమాలతో బిజీగా వుంది..

Star Heroine Rakul Preet Singh Brother Launching In Tollywood As A Hero--Star Heroine Rakul Preet Singh Brother Launching In Tollywood As A Hero-

ఇదిలా వుంటే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ఇప్పటికే హీరోగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.రాక్ అండ్ రోల్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఇప్పుడు తెలుగులో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.తమ్ముడుని హీరోగా చూసుకోవాలని కలలు కంటున్న స్టార్ హీరోయిన్ రకుల్ అతనికోసం తెలుగులో మంచి ఫ్లాట్ ఫాం రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

దాసరి లారెన్స్ అనే యువ దర్శకుడు అమన్ ని హీరోగా పరిచయం చేయబోతున్నాడు.ఇక ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకేక్కుతున్నట్లు తెలుస్తుంది.ఈ రోజు సాయంత్రం ఈ సినిమాకి లాంచింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరగనుంది.

మరి టాలీవుడ్ లో అక్క ఇమేజ్ తమ్ముడు ఎ స్థాయిలో అందుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.