రూ.కోటి డిమాండ్ చేస్తున్న బాలయ్య హీరోయిన్.. ఆఫర్లు వస్తాయా?

ప్రముఖ ఓటీటీ యాప్ లలో ఒకటైన హాట్ స్టార్ లో ఈ నెల 21వ తేదీ నుంచి బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటించిన సంగతి తెలిసిందే.

 Star Heroine Pragya Jaiswal Demands 1 Crore Rupees But , 1 Crore Rupees , Akhand-TeluguStop.com

కంచె సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ కు తొలి సినిమాతోనే సక్సెస్ దక్కింది.అయితే ఆ సినిమా మరీ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడంతో ప్రగ్యాకు వరుసగా ఆఫర్లు దక్కలేదు.

కంచెలో ట్రెడిషనల్ రోల్ లోనే కనిపించిన ప్రగ్యా జైస్వాల్ తర్వాత సినిమాల్లో మాత్రం గ్లామరస్ రోల్స్ లో ఎక్కువగా కనిపించారు.అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడం ప్రగ్యా కెరీర్ కు మైనస్ గా మారింది.

జయ జానకి నాయక  సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ను ఆఫర్ చేసిన బోయపాటి శ్రీను అఖండ సినిమాలో మాత్రం ప్రగ్యా జైస్వాల్ కు మెయిన్ హీరోయిన్ రోల్ ను ఆఫర్ చేశారు.

డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదలై అంచనాలకు అందని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే అఖండ సక్సెస్ తర్వాత ఈ బ్యూటీ ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందని అందువల్లే ఈ హీరోయిన్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడలేదని సమాచారం.సీనియర్ హీరోలకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ కు ఆఫర్లు వస్తుండగా ప్రగ్యా జైస్వాల్ ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రగ్యా జైస్వాల్ చేస్తున్న డిమాండ్లకు నిర్మాతలు అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.ప్రగ్యా రెమ్యునరేషన్ ను కొంత మొత్తం తగ్గిస్తే బాగుంటుందనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరి ప్రగ్యా ఆ దిశగా ఆలోచనలు చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

Star Heroine Pragya Jaiswal Demands 1 Crore Rupees But , 1 Crore Rupees , Akhanda Movie, Balakrishna , Interesting Facts, Pragya Jaiswal - Telugu Crore Rupees, Akhanda, Balakrishna, Pragya Jaiswal #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube