'మీరు మనిషేనా?' అని బాలకృష్ణని అడిగా.. ప్రగ్యా జైస్వాల్ కామెంట్స్ వైరల్!

Star Heroine Pragya Jaiswal Comments About Balakrishna And Akhanda Movie

అందం, అభినయంతో ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు.తెలుగులో ప్రగ్యా జైస్వాల్ నటించిన సినిమాల ల్లో  కంచె, జయ జానకి నాయక సినిమాలు హిట్ అయ్యాయి.

 Star Heroine Pragya Jaiswal Comments About Balakrishna And Akhanda Movie-TeluguStop.com

కొన్ని సినిమాల్లో అభినయ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ మరికొన్ని సినిమాలలో మాత్రం గ్లామరస్ రోల్స్ లో నటించారు.ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆఫర్లు లేని ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాలో అవకాశాన్ని సంపాదించుకున్నారు.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించగా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.తాజాగా మీడియాతో ముచ్చటించిన ప్రగ్యా జైస్వాల్ ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో తాను నటించిన రెండో సినిమా అఖండ అని వెల్లడించారు.

 Star Heroine Pragya Jaiswal Comments About Balakrishna And Akhanda Movie-మీరు మనిషేనా’ అని బాలకృష్ణని అడిగా.. ప్రగ్యా జైస్వాల్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డైరెక్టర్ బోయపాటి శ్రీను పాత్రకు న్యాయం చేసే నటీనటులను మాత్రమే ఎంచుకుంటారని ప్రగ్యా జైస్వాల్ పేర్కొన్నారు.

ఐఏఎస్ శ్రావణ్య అనే పాత్రలో ఈ సినిమాలో తాను కనిపిస్తానని కథ పూర్తిగా వినకుండానే ఈ సినిమాకు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చారు.

Telugu Akhanda, Balakrishna, Balkrishna, Boyapati Shrinu, December, Dwaraka, Pragya Jaiswal, Pragyajaiswal, Tollwyood-Movie

డైరెక్టర్ సూచనల ప్రకారం ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి ఎంతో శ్రమించానని ప్రగ్యా జైస్వాల్ వెల్లడించారు.ఈ సినిమాతో కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుందని ఆశిస్తున్నానని ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చారు.తన పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని ప్రగ్యా జైస్వాల్ పేర్కొన్నారు.

Telugu Akhanda, Balakrishna, Balkrishna, Boyapati Shrinu, December, Dwaraka, Pragya Jaiswal, Pragyajaiswal, Tollwyood-Movie

తన పాత్రకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల సినిమాలోకి అఖండ అనే పాత్ర ఎంట్రీ ఇస్తుందని ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చారు.బాలయ్య 3 గంటలకే లేచి 6 గంటలకు సెట్ కు వచ్చేవారని బాలయ్య ఎనర్జీ చూసి తాను షాకయ్యేదానినని ప్రగ్యా జైస్వాల్ వెల్లడించారు.ఒకరోజు బాలయ్యతో సరదాగా మీరు మనిషేనా? అని అడిగానని ప్రగ్యా జైస్వాల్ కామెంట్లు చేశారు.బాలయ్య పక్కన నటించడం అంటే సవాల్ అని బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రగ్యా జైస్వాల్ పేర్కొన్నారు.

#PragyaJaiswal #Dwaraka #Ias Shravanya #Balakrishna #Tollwyood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube