హీరోయిన్ లక్ష్మీ రాయ్ తొలి సంపాదన ఎంతో తెలుసా..?

తెలుగులో హీరోయిన్ పాత్రల కంటే స్పెషల్ సాంగ్స్ ద్వారానే లక్ష్మీరాయ్ మంచి పేరును సంపాదించుకున్నారు.2005 సంవత్సరం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ నటి 50కు పైగా సినిమాలలో నటించగా ఈ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.తెలుగులో లక్ష్మీ రాయ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేకపోయినా ఇతర ఇండస్ట్రీల్లో మాత్రం ఈ నటికి మంచి గుర్తింపు రావడం గమనార్హం.

 Star Heroine Laxmi Rai First Remuneration Details-TeluguStop.com

కొత్త హీరోయిన్ల నుంచి పోటీ ఎదురవుతున్నా లక్ష్మీరాయ్ మాత్రం ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.

అయితే అభిమానులు మాత్రం లక్ష్మీ రాయ్ ను అసలు పేర్లతో కంటే ముద్దుపేర్లతో మాత్రమే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు.అక్కలు లక్ష్మీ రాయ్ ను కృష్ణా అని పిలిస్తే అమ్మ లూసీ అని పిలుస్తుంది.

 Star Heroine Laxmi Rai First Remuneration Details-హీరోయిన్ లక్ష్మీ రాయ్ తొలి సంపాదన ఎంతో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లక్ష్మికి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండగా లక్ష్మీ రాయ్ ఫేవరెట్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కావడం గమనార్హం.

బలుపు, ఖైదీ నంబర్ 150 సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ లక్ష్మీరాయ్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.కెరీర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసిన లక్ష్మీ రాయ్ కు తర్వాత రోజుల్లో ఆఫర్లు అంతకంతకూ పెరిగాయి.శివ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన వాల్మీకి సినిమాతో లక్ష్మీ రాయ్ తొలి పారితోషికాన్ని అందుకున్నారు.

లక్ష్మీరాయ్ తొలి పారితోషికం 25వేల రూపాయలు కావడం గమనార్హం.దైవభక్తి ఎక్కువగా ఉన్న లక్ష్మీరాయ్ నమ్మకద్రోహాన్ని మాత్రం అస్సలు ఇష్టపడరు.

జీరో సైజ్ మీద నమ్మకం లేని ఈ హీరోయిన్ ఇతర హీరోయిన్లు జీరోసైజ్ లుక్ కోసం ప్రయత్నిస్తున్నా ఆ దారిలో వెళ్లాలని అస్సలు అనుకోవడం లేదు. అశ్లీలానికి, గ్లామరస్ గా కనిపించడానికి చాలా తేడా ఉందని ఆమె భావిస్తున్నారు.ఎలాంటి పాత్రలో నటించినా పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఆమె అనుకుంటారు.

#Laxmi Rai #LakhmiRai #25000 Rupees #StarHeroine #LakhmiRai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు