తల్లి కాబోతున్నానని శుభవార్త చెప్పిన గేమ్ ఛేంజర్ బ్యూటీ.. అలా ఎక్స్ ప్రెస్ చేస్తూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కియారా అద్వానీ( Kiara Advani ) ఒకరు.

వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఈ సినిమాలతో కమర్షియల్ విజయాలను సొంతం చేసుకునే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కియారా అద్వానీ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే తాజాగా ఈ బ్యూటీ తల్లి( Mother ) కాబోతున్నట్టు కీలక ప్రకటన చేయగా ఆ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

"మా జీవితాల్లో గ్రేటెస్ట్ గిఫ్ట్.కమింగ్ సూన్" అని ఆమె పేర్కొన్నారు.

కియారా, ఆమె భర్త సిద్దార్థ్( Siddharth ) చేతులు కనిపించేలా ఫోటోను ఆమె పంచుకున్నారు.కియారా అద్వానీ రెమ్యునరేషన్ ప్రస్తుతం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

Advertisement

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తర్వాత సినిమాలతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.షేర్షా సినిమా సమయంలో కియారా అద్వానీ సిద్దార్థ్ మధ్య పరిచయం ఏర్పడగా ఆ పరిచయం ప్రేమగా మారింది.2023 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కియారా సిద్దార్థ్ వివాహం జరగగా పెళ్లి తర్వాత ఈ జోడీ అన్యోన్యంగా ఉన్నారు.

పాన్ ఇండియా బ్యూటీగా కియారా అద్వానీకి మంచి గుర్తింపు ఉండగా కెరీర్ ను ఈ బ్యూటీ ఒకింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.కియారా అద్వానీ అటు సినీ కెరీర్ పరంగా వ్యక్తిగత కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే కియారా సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది.

తెలుగులో ఆఫర్లు వస్తే కియారా అద్వానీ వాటికి ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు