కీర్తి సురేష్ తొలి సంపాదన అంత తక్కువా..?

సాధారణంగా హీరోయిన్ల సంపాదన లక్షల్లో, కోట్లలో ఉంటుందనే సంగతి తెలిసిందే.తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు.

 Star Heroine Keerthy Suresh First Remuneration Detials-TeluguStop.com

ప్రస్తుతం కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.అయితే ఈ స్టార్ హీరోయిన్ తొలి సంపాదన కేవలం 500 రూపాయలు కావడం గమనార్హం.

బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన కీర్తి సురేష్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.కీర్తి సురేష్ తల్లిదండ్రులు సినిమా రంగానికి చెందిన వారు కావడంతో కీర్తికి తెలుగులో సులభంగానే ఆఫర్లు వచ్చాయి.

 Star Heroine Keerthy Suresh First Remuneration Detials-కీర్తి సురేష్ తొలి సంపాదన అంత తక్కువా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ కు బాలనటిగా తీసుకున్న పారితోషికానికి సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి.బాల్యంలో సినిమాల్లో నటించిన సమయంలో నిర్మాతలు ఇచ్చిన కవర్ ను డాడీకి ఇచ్చేదానినని కీర్తి సురేష్ పేర్కొన్నారు.

Telugu 500 Rupees, Annatte, First Remuneration, Keerthy Suresh, Sarkaru Vari Pata-Movie

ఆ సమయంలో తనకు నిర్మాతలు ఎంత ఇచ్చారనే విషయం అస్సలు తెలియదని ఆమె వెల్లడించారు.అయితే ఫ్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో షోలలో పాల్గొన్నానని ఆ సమయంలో తనకు 500 రూపాయలు ఇచ్చారని అదే తన తొలి పారితోషికం అని కీర్తి సురేష్ వెల్లడించారు.ఆ 500 రూపాయలను కూడా తాను నాన్నకే ఇచ్చేశానని నాన్నకు అలా డబ్బులు ఇవ్వడం తనకు సెంటిమెంట్ అని కీర్తి సురేష్ పేర్కొన్నారు.

ఈ ఏడాది రంగ్ దే సినిమాతో కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాతో పాటు రజనీకాంత్ అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు.కీర్తి సురేష్ ఒకేసారి టాలీవుడ్, కోలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం.

ఈ రెండు సినిమాలతో కీర్తి రెండు బ్లాక్ బస్టర్ హిట్లను సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

#500 Rupees #Annatte #Keerthy Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు