టక్ జగదీష్ లో ఐటెం సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్... ఇంటరెస్టింగ్ అప్డేట్

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసింది.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని శివ నిర్వాణ ఆవిష్కరించారు.

 Star Heroine Item Song In Tuck Jagadish Movie-TeluguStop.com

నిజానికి ఈ నెలలోనే సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది.అయితే కరోనా సెకండ్ వేవ్ సిచువేషన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నారు.

ప్రస్తుత పరిస్థితిలో థియేటర్స్ కి వచ్చి ప్రేక్షకులు సినిమా చూడటానికి సిద్ధంగా లేకపోవడంతోనే చిత్ర నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

 Star Heroine Item Song In Tuck Jagadish Movie-టక్ జగదీష్ లో ఐటెం సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్… ఇంటరెస్టింగ్ అప్డేట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథ కాబట్టి పెళ్లి వేడుక సిచువేషన్ లో ఒక స్టార్ హీరోయిన్ తో సంగీత్ ఈవెంట్ తరహాలో ఈ సాంగ్ చేయించినట్లు తెలుస్తుంది.

స్టార్ హీరోయిన్ సాంగ్ విషయాన్ని చిత్ర యూనిట్ సీక్రెట్ గా ఉంచి రిలీజ్ తర్వాత సర్ప్రైజ్ చేయాలని భావించిందని సమాచారం.అయితే రిలీజ్ వాయిదా పడటంతో ఈ విషయం బయటకి వచ్చింది.

గతంలో తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ లో డాన్స్ చేశారు.అయితే టక్ జగదీష్ సినిమాలో డాన్స్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రితూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇక నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

#Natural Nani #Tollwood #Shiva Nirvana #Tuck Jagadish #Ritu Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు