అబార్షన్ పై స్పందించిన హీరోయిన్ ఇలియానా.. ఏం చెప్పారంటే..?

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించి గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి.ఆ గాసిప్స్ లో కొన్ని గాసిప్స్ సెలబ్రిటీలకు నవ్వు తెప్పించే విధంగా ఉంటే మరికొన్ని గాసిప్స్ మాత్రం సెలబ్రిటీలకు తీవ్ర ఆగ్రహం తెప్పించే విధంగా ఉండటం గమనార్హం.

 Star Heroine Ileana Clarity About Abortion Rumors-TeluguStop.com

స్టార్ హీరోయిన్ ఇలియానా టాలీవుడ్ కు దూరమై ప్రస్తుతం బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే.అయితే ఈ హీరోయిన్ కు సంబంధించి గతంలో కొన్ని గాసిప్స్ తెగ వైరల్ అయ్యాయి.

ఇలియానా ఆత్మహత్యాయత్నం చేశారని ఒక గాసిప్ వైరల్ కాగా ఇలియానా గర్భవతి అని అభార్షన్ చేయించుకున్నారని మరో గాసిప్ ప్రచారంలోకి వచ్చింది.అయితే తాజాగా ఒక సందర్భంలో ఇలియానా స్పందిస్తూ గతంలో వైరల్ అయిన గాసిప్స్ పై స్పష్టతనివ్వడంతో పాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 Star Heroine Ileana Clarity About Abortion Rumors-అబార్షన్ పై స్పందించిన హీరోయిన్ ఇలియానా.. ఏం చెప్పారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను ప్రెగ్నెంట్ అని కొంతమంది లేనిపోని రూమర్లను సృష్టించారని ఇలియానా వెల్లడించారు.కొంతమంది తాను అబార్షన్ చేయించుకుంటానని చాటింపు వేశారని చెప్పారు.

Telugu Abortion, Ileana, Ileana Clarification, Ileana Gossips, Ileana Pregnant, Ileana Suicide Attempt, Rumours Viral About Ileana, Suicide Attempt, Suicide Attemt-Movie

అబార్షన్ గురించి వచ్చిన వార్తలను విని తాను చాలా బాధ పడ్డానని ఇలియానా వెల్లడించారు.ఇంత దారుణమైన వార్తలను ప్రచారం చేస్తారా అని తాను అనుకున్నానని ఇలియానా చెప్పుకొచ్చారు.ఆ తరువాత తాను సూసైడ్ అటెంప్ట్ చేశానని తన ఇంట్లో పని చేసే పనిమనిషి ఆత్మహత్య ప్రయత్నంను అడ్డుకుందని కథనాలు ప్రచారంలో వచ్చాయని ఇలియానా పేర్కొన్నారు.తన ఇంట్లో అసలు పనిమనిషే లేదని ఆమె వెల్లడించారు.

తాను తన లైఫ్ లో ఎప్పుడూ ఆత్మహత్యాయత్నం చేయలేదని ఇలాంటి పిచ్చిపిచ్చి వార్తలు ఎక్కడ దొరుకుతాయో తనకు అస్సలు అర్థం కాదని ఇలియానా చెప్పుకొచ్చారు.దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఇలియానా ప్రెగ్నెంట్ అని వార్తలు రాగా ఆ వార్తల గురించి స్పందించి ఇలియానా స్పష్టతనిచ్చారు.

#Ileana Gossips #Ileana #RumoursViral #IleanaSuicide #Ileana Pregnant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు