స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.. టెన్షన్ లో ఫ్యాన్స్..?

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, స్టార్ హీరోయిన్లకు కరోనా నిర్ధారణ అయింది.

 Star Heroine Deepika Padukone Tested Corona Positive Corona Positive , Deepika F-TeluguStop.com

తాజాగా మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కరోనా బారిన పడ్డారు.దీపికతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం.

కొన్ని రోజుల క్రితం దీపిక తండ్రి ప్రకాష్ పడుకొనే కరోనా బారిన పడ్డారు.

దీపిక ఆయనను బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించగా ఆయన అక్కడ కరోనాకు చికిత్స చేయించుకుంటున్నారు.

ఆ తర్వాత దీపిక తల్లి, సోదరిలకు కరోనా నిర్ధారణ అయింది.తాజాగా దీపిక కరోనా పరీక్షలు చేయించుకోగా ఆమెకు కూడా పాజిటివ్ రావడం గమనార్హం.అయితే దీపిక నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన రావాల్సి ఉంది.దీపిక ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడగా ఆమె కుటుంబ సభ్యులు వైరస్ నుంచి కోలుకుంటున్నారని తెలుస్తోంది.

Telugu @deepikapadukone, Corona, Deepika, Fans-Movie

ప్రస్తుతం దీపిక 83 అనే మూవీలో నటిస్తున్నారు.దీపిక ఈ మూవీలో ఆమె భర్తతో కలిసి నటిస్తుండటం గమనార్హం.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణే భర్త రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. కపిల్ దేవ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా రోమి అనే పాత్రలో ఈ సినిమాలో దీపిక నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు దీపిక చేతిలో మరికొన్ని సినిమా ఆఫర్లు ఉన్నాయి.

దీపికకు కరోనా సోకిందని వస్తున్న వార్తల విషయంలో ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

కొంతమంది కరోనా బారిన పడినప్పటికీ త్వరగానే కోలుకుంటున్నా మరి కొంతమందికి మాత్రం కరోనా వల్ల ప్రాణానికే అపాయం ఏర్పడుతోంది.కరోనా నుంచి దీపిక త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube