ఈ స్టార్ హీరోయిన్ ధరించిన చీర ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోయిన్లు కనిష్టంగా 30 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 6 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.ఆకాశమే నీ హద్దురా సినిమాతో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న అపర్ణ బాలమురళికి సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Star Heroine Aparna Balamurali Raw Mango Brand Saree Worth 95000 Rupees Details,-TeluguStop.com

గ్లామరస్ హీరోయిన్ గా అపర్ణ కెరీర్ ను కొనసాగిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పిస్తున్నారు.

తమిళ, మలయాళ భాషల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న అపర్ణ బాలమురళి చీరలో దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

అపర్ణ బాలమురళి ధరించిన ఈ చీర ఖరీదు ఏకంగా 95,000 రూపాయలు కావడం గమనార్హం.ఈ చీర రా మ్యాంగో బ్రాండ్ కు సంబంధించిన చీర కావడం గమనార్హం.

సినిమాల గురించి, ఫ్యాషన్ గురించి అపర్ణ బాలమురళి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను గ్లామరస్ హీరోయిన్ గా మిగిలిపోవడానికి సినిమా ఇండస్ట్రీకి రాలేదని ఆమె అన్నారు.

Telugu Rupees, Aakashamenee, Heorineaparna, Raw Mango-Movie

తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం కూడా ఇష్టమేనని ఆమె చెప్పుకొచ్చారు.నటిగానే కాక ప్లేబ్యాక్ సింగర్ గా కూడా అపర్ణ బాలమురళికి ప్రత్యేక గుర్తింపు ఉండటం గమనార్హం.2015 సంవత్సరంలో ఒరు సెకండ్ క్లాస్ యాత్ర సినిమాతో నటిగా అపర్ణ బాలమురళి సినీ కెరీర్ మొదలైందని సమాచారం.

Telugu Rupees, Aakashamenee, Heorineaparna, Raw Mango-Movie

పలు సినిమాలలో అపర్ణ బాలమురళి క్యామియో, స్పెషల్ రోల్స్ లో నటించి మెప్పించడం గమనార్హం.తెలుగు సినిమాలలో కూడా అపర్ణ బాలమురళి నటిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.మరి తెలుగు సినిమాలపై అపర్ణ బాలమురళి ఆసక్తి చూపిస్తారో లేదో చూడాల్సి ఉంది.

అపర్ణ బాలమురళి నటిస్తున్న పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.మలయాళ సినిమాలలో ఆమె ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube