మహేష్ బాబు సినిమాలో జేజమ్మ.. అలాంటి పాత్రలో ..?  

star heroine anushka playing bank office role in sarkar vari pata movie, Mahesh Babu, Anushka Shetti, Keerthi Suresh - Telugu Anushka Bank Officer Role, Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Sarkar Vari Pata Movie

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు హ్యాట్రిక్ విజయాలతో సినిమాసినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటున్నారనే సంగతి తెలిసిందే.2021 జనవరి నుంచి గీతాగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొనబోతున్నారు.ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ నుంచి కొన్ని రోజుల క్రితం ప్రకటన వెలువడింది.

TeluguStop.com - Star Heroine Anushka Playing Bank Office Role In Sarkar Vari Pata Movie

అయితే ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క కూడా నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే సర్కార్ వారి పాట సినిమా యూనిట్ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.మహేష్ బాబు ఈ సినిమాలో బ్యాంక్ మేనేజర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

TeluguStop.com - మహేష్ బాబు సినిమాలో జేజమ్మ.. అలాంటి పాత్రలో ..-Gossips-Telugu Tollywood Photo Image

హీరోయిన్ అనుష్క కూడా సినిమాలో బ్యాంక్ లో పని చేసే ఉద్యోగి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

మహేష్ బాబు అనుష్క హీరోహీరోయిన్లుగా ఖలేజా సినిమాలో కలిసి నటించారు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.అయితే హీరోహీరోయిన్లుగా మహేష్ అనుష్క జోడీ బాగుందని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.

ఖలేజా సినిమా తరువాత మహేష్ అనుష్క కాంబినేషన్ లో సినిమా రాలేదు.అయితే మహేష్ అనుష్క మళ్లీ కలిసి నటించబోతున్నట్లు వైరల్ అవుతున్న వార్తలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.

నిశ్శబ్దం సినిమా విడుదలైన తరువాత అనుష్క కథలను వింటున్నా సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.కొంతకాలం లేడీఓరియెంటెడ్ సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని అనుష్క భావిస్తున్నట్టు సమాచారం.

అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నిశ్శబ్దం సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా ఫలితంతో అనుష్క కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

#Mahesh Babu #Parasuram #AnushkaBank #SarkarVari #Keerthy Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Star Heroine Anushka Playing Bank Office Role In Sarkar Vari Pata Movie Related Telugu News,Photos/Pics,Images..