పెళ్లిపై అనుష్క అభిప్రాయం ఇదే.. అవాక్కైన ఫ్యాన్స్..?

సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 17 సంవత్సరాలు అయినా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.అనుష్క తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

 Star Heroine Anushka Interesting Comments About Marriage, Anushka Shetty, Intere-TeluguStop.com

అనుష్క వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు కావడంతో ఆమె పెళ్లి గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఈ మధ్య కాలంలో బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయారు.

మరోవైపు అనుష్క పెళ్లికి సంబంధించి స్పష్టత ఇవ్వడం లేదు.మరోవైపు అనుష్కకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా.? లేదా.? అనే ప్రశ్నకు సమాధానం అభిమానులకు తెలియలేదు.అయితే తాజాగా ఒక ట్వీట్ ద్వారా అనుష్కకు పెళ్లిపై ఉన్న అభిప్రాయం అభిమానులకు తెలిసింది.గతేడాది కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

కాజల్ అగర్వాల్ కు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ అనుష్క ట్వీట్ చేశారు.

అయితే అనుష్క ట్విట్టర్ అకౌంట్ వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్ కాకపోవడంతో తాజాగా కాజల్ అగర్వాల్ అనుష్క ట్వీట్ కు బదులిచ్చారు.

Telugu Age, Anushka Fans, Anushka Shetty, Gowtham Kichlu, Kajal Agarwal, Size Ze

అనుష్క కాజల్ అగర్వాల్ కు పెట్టిన ట్వీట్ లో భూమిపై అన్నిటికంటే ఎక్కువ సంతోషం పెళ్లిలోనే ఉందని ఆమె పేర్కొన్నారు.ఆత్మలు రెండు అయినా ఆలోచన ఒకేటనని గుండెలు రెండు అయినా శబ్దం మాత్రం ఒకటేనని అనుష్క ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొన్నారు.

అనుష్కకు పెళ్లిపై ఉన్న అభిప్రాయం గురించి తెలిసి అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.అనుష్క త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.అనుష్క పెళ్లి ఎప్పుడని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.త్వరలోనే అనుష్క ఫ్యాన్స్ కు శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube