ఆ పాట విన్నాక మాటలు రావడం లేదు.. అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు!

Star Heroine Anushka Comments About Rrr Janani Song

స్టార్ హీరోయిన్ అనుష్క 15 సంవత్సరాలుగా వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రమార్కుడు, బాహుబలి, బాహుబలి2 సినిమాలలో అనుష్క నటించారు.

 Star Heroine Anushka Comments About Rrr Janani Song-TeluguStop.com

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ నుంచి తాజాగా జనని సాంగ్ రిలీజ్ కాగా అనుష్కపాట గురించి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.పాట విన్నాక తనకు మాటలు రావడం లేదని అనుష్క అన్నారు.

జనని పాట విన్న తర్వాత తాను భావోద్వేగానికి గురయ్యానని అనుష్క వెల్లడించారు.రామ్ చరణ్, తారక్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది.

 Star Heroine Anushka Comments About Rrr Janani Song-ఆ పాట విన్నాక మాటలు రావడం లేదు.. అనుష్క ఆసక్తికర వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో నటించగా రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం.

అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా త్వరలో ఆ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.

టాలీవుడ్ హీరో నిఖిల్ జనని పాటను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.తాను 20సార్లు జనని పాటను చూశానని నిఖిల్ చెప్పుకొచ్చారు.ఆ పాటను చూసిన సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని నిఖిల్ కామెంట్లు చేశారు.దేశం మొత్తాన్ని ఆర్ఆర్ఆర్ ఎమోషనల్ గా దగ్గర చేస్తుందని నిఖిల్ పేర్కొన్నారు.

రాజమౌళి, కీరవాణి ప్రేక్షకులను మరోసారి గర్వపడేలా చేస్తారని నిఖిల్ కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని తన విన్నపమని నిఖిల్ చెప్పుకొచ్చారు.మరి ఆర్ఆర్ఆర్ కు పన్ను మినహాయింపు లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది.సెలబ్రిటీలు ఈ సినిమా గురించి పాజిటివ్ పోస్టులు పెడుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు.

#Janani #Anushka Janani #Ram Charan #RRR #Anushka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube