వామ్మో.. గంగూబాయ్ సినిమా కొరకు అలియా భట్ అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారా?

ఒకవైపు సినిమా హీరోల పారితోషికం కళ్లు చెదిరే స్థాయిలో పెరుగుతుంటే స్టార్ హీరోయిన్లు సైతం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాకపోయినా ఈ సినిమా ద్వారా అలియా భట్ కు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.

 Star Heroine Alia Bhatt Remuneration For Gangubhai Movie Details Here , Gangubha-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ కేవలం 20 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అలియా భట్ ప్రధాన పాత్రలో గంగూబాయ్ కథియావాడీ సినిమా తెరకెక్కింది.

జనవరి 6వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల, ఇతర కారణాల వల్ల వాయిదా పడింది.అయితే ఈ సినిమా కొరకు అలియా భట్ ఏకంగా 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారనే వార్త అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

తెలుగులో స్టార్ స్టేటస్ ఉన్న హీరోల పారితోషికంతో పోల్చితే ఈ మొత్తం చాలా ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

Telugu Alia Bhatt, Bollywood, Rrr, Sanjayleela, Tollywood-Movie

సౌత్ ఇండియాలో ఒక్కో సినిమాకు నయనతార నాలుగు కోట్ల రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలిసి చాలామంది అవాకయ్యారు.అయితే అలియా భట్ పారితోషికం మాత్రం రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం.కొంతమంది హీరోయిన్లు తమ కష్టానికి తగిన రెమ్యునరేషన్ లభించడం లేదని చెబుతుంటే మరి కొందరు హీరోయిన్లు మాత్రం అంచనాలకు అందని స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

Telugu Alia Bhatt, Bollywood, Rrr, Sanjayleela, Tollywood-Movie

బాలీవుడ్ హీరోయిన్ కావడం, అన్ని భాషల్లో క్రేజ్ ఉండటం వల్లే అలియా భట్ కు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం సాధ్యమైందని బోగట్టా.బాలీవుడ్ మీడియా వర్గాల్లో ప్రస్తుతం అలియా భట్ రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతోంది.డిమాండ్ ఉండటంతో రెమ్యునరేషన్ విషయంలో అలియా భట్ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సమాచారం.సినిమాసినిమాకు అలియా భట్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube