తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ అలియా భట్.. అందుకే అంత త్వరగా పెళ్ళి?

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

 Star Heroine Alia Bhatt Is Going To Be A Mother So That Why Get Married So Soon, Alia Bhatt, Ranbir, Bollywood, Pregnancy, Film Industry-TeluguStop.com

హిందీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఇక ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కానుంది.

ఆ మధ్య రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Star Heroine Alia Bhatt Is Going To Be A Mother So That Why Get Married So Soon, Alia Bhatt, Ranbir, Bollywood, Pregnancy, Film Industry-తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ అలియా భట్.. అందుకే అంత త్వరగా పెళ్ళి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిత్యం తన ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.తెగ వర్క్ అవుట్ లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

కెరీర్ మొదట్లో కాస్త లావుగా ఉన్న ఆలియా భట్ రాను రాను తన శరీరాన్ని నాజుగ్గా మార్చుకుంటుంది.నిత్యం యోగాలు చేస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.అందం విషయంలో కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటుంది.ఇక ఈమె బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ తో ఐదు సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉండి ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన వాస్తులో తమ కుటుంబసభ్యుల, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

Telugu Alia Bhatt, Bollywood, Pregnancy, Ranbir-Latest News - Telugu

ఆ సమయంలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారాయి.బాలీవుడ్ లో ఈ జంట కూడా క్యూట్ కపుల్ గా నిలిచింది.అంతేకాకుండా ఇద్దరూ పలు ప్రాజెక్టులలో కూడా బాగా అవకాశాలు అందుకున్నారు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ప్రేక్షకులకు, తన అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది.త్వరలో ఆలియా భట్ తల్లి కాబోతుంది.

ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటో కూడా తాను తన ఇన్ స్టా లో పంచుకోగా అది చూసిన నెటిజన్లు, తన అభిమానులు లైకులు కొడుతున్నారు.అంతేకాకుండా ఆ ఫోటోకు త్వరలో పాపాయి రాబోతుంది అని క్యాప్షన్ కూడా పెట్టింది.

Telugu Alia Bhatt, Bollywood, Pregnancy, Ranbir-Latest News - Telugu

ఈమె ప్రెగ్నెన్సీ కన్ఫామ్ బాలీవుడ్ ప్రముఖులు కూడా తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మరోవైపు కొందరు ఒక పుకారు ను బాగా పండిస్తున్నారు.అదేంటంటే ఆలియా భట్ తను ఎన్ని నెలల ప్రెగ్నెన్సీ అని చెప్పక పోవడంతో.పెళ్లికి ముందే వీరు ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేశారని.అందుకే అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు అని బాగా ప్రచారం చేస్తున్నారు.ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే బేబీ పుట్టే వరకు వేచి చూడక తప్పదు.

మరి ఈ పుకారు గురించి కూడా ఈ క్యూట్ కపుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube